విశాఖ జిల్లా సింహాచలం అప్పన్న సన్నిధిలో తెలుగు రాష్ట్రాల పంచాంగ కర్తల సమావేశం జరిగింది. శ్రీ శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి అనుగ్రహభాషణం చేశారు. ఈ సందర్భంగా స్వామీజీ మాట్లాడుతూ... తెలుగు రాష్ట్రాల్లో పంచాంగం ఒకేలా ఉండాలని... ఈ సమావేశ ముఖ్య ఉద్ధేశం ఇదేనని స్పష్టం చేశారు. దేశమంతటా... తెలుగు రాష్ట్రాల్లో రచించిన పంచాంగం అనుసరిస్తున్నారని వివరించారు. ముందు జరిగే ఉపద్రవాలు, ముహూర్తాలను తెలుగువారు చెబుతున్నారంటే... అది మన గొప్పతనమని పేర్కొన్నారు. తెలుగు రాష్ట్రాల పండితులు సిద్ధహస్తులని... ప్రపంచం గుర్తించడం గర్వకారణమన్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న పంచాంగ కర్తలు ఈ సమావేశానికి హాజరయ్యారు.
ఇదీ చూడండి: గొప్ప అవకాశం.. భక్తుల చెంతకే సింహాద్రి అప్పన్న