ఎంపీ విజయసాయిరెడ్డి.. అధికారులపై ఒత్తిడి చేస్తూ ఓటర్ల జాబితాలో అవకతవకలకు పాల్పడినట్టు తెలుగు శక్తి అధ్యక్షుడు బీవీ రామ్ ఆరోపించారు. ఎన్నికలు ముగిసేవరకు ఉత్తరాంధ్ర జిల్లాల వైకాపా ఇన్ఛార్జీలు, ఎంపీ విజయసాయిరెడ్డిని ఉత్తరాంధ్రలో అడుగుపెట్టకుండా చూడాలని ఎన్నికల సంఘాన్ని కోరారు. గత నెల 30న జీవీఎంసీలోని పలు వార్డుల పరిధిలో ఓటరు జాబితాలో అవకతవకలు జరిగాయని ఎస్ఈసీకి ఫిర్యాదు చేశామని.. అయితే అధికారులపై ఒత్తిడి చేసి తప్పుడు రిపోర్టు ఇచ్చేలా చేశారని విజయసాయిరెడ్డిపై మండిపడ్డారు. కర్మాగారం, కారాగారానికి తేడాతెలియని వ్యక్తి ఎంపీగా ఉండటం దురదృష్టకరమన్నారు.
ఎస్సీ, ఎస్టీ, బీసీల సంక్షేమానికి కృషి చేస్తానని చెబుతున్న ముఖ్యమంత్రి జగన్.. భీమిలిలో ఓ బీసీపై హత్యాయత్నం జరిగితే నిద్రపోతున్నారా అని ప్రశ్నించారు.
ఇదీ చదవండి: 'శాసన రాజధాని అసంపూర్తి భవనాల కోసం రూ.2,154 కోట్లు అవసరం'