స్థానిక సంస్థల ఎన్నికల్లో తెదేపా అభ్యర్థుల విజయానికి కార్యకర్తలు శక్తివంచన లేకుండా కృషిచేయాలని ఎమ్మెల్సీ బుద్ధ నాగ జగదీశ్వరరావు పిలుపునిచ్చారు. విశాఖ మన్యం అరకు నియోజకవర్గంలోని స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు. నియోజకవర్గ పరిధిలోని 86 ఎంపీటీసీ.. 6 జడ్పీటీసీ స్థానాలకు సంబంధించిన తెదేపా అభ్యర్థులుకు పలు సూచనలు చేశారు. వైకాపా నాయకుల బెదిరింపులకు కార్యకర్తలు భయపడకుండా పార్టీ అభ్యర్థులంతా విజయానికి కృషి చేయాలని కోరారు.
ఇదీ చదవండి: జడ్పీ, ఎంపీటీసీ ఎన్నికలకు నామినేషన్లు...రేపటితో ముగియనున్న గడువు