ETV Bharat / state

పొగమంచు సోయగాలు చూడతరమా.. - snow beauti in visakhapatnam district news update

చలికాలం సొగసు చూడతారమా అన్నట్టు.. ఎక్కడో ఊటీ, కొడై​కెనాల్​లో కనిపించే పొగమంచు అందాలు మన నగరంలో కనిపించి కనువిందు చేస్తే ఇదిగో ఇలాగే ఉంటుంది. దట్టమైన పొగమంచు దుప్పటిలా భూమిని కమ్మేసింది. దీంతో రోజూ మనం చూసే ప్రాంతాలు సరికొత్త సొగసులు అద్దుకున్నాయి. తెల్ల తెల్లగా తెలవారుతున్న వేళ పొగమంచును చీల్చుకు వచ్చే సూర్యుడి కాంతి కిరణాలు కనువిందు చేస్తుంది. రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో కమ్ముకున్న పొగమంచు కొత్త అందాలను చూస్తూ స్థానికులు పరవశిస్తున్నారు.

snow-beauty-in-chodavaram-visakha-district
పొగమంచు సోయగాలు చూడతరమా..
author img

By

Published : Nov 20, 2020, 6:50 AM IST

Updated : Nov 20, 2020, 12:55 PM IST

చోడవరంలో పొగమంచు సోయగాలు..

విశాఖ గ్రామీణ జిల్లాలోని చోడవరం నియోజకవర్గ కేంద్రమైన చోడవరంలో తెల్లవారుజామున దట్టమైన పొగమంచు అందాలు మనస్సును దోచుకుంటున్నాయి. దారులు సైతం కనపడని విధంగా తెల్లటి పొగమంచు దుప్పటిలా భూమిని కప్పేయడంతో వాహన చోదకులు ఇబ్బందులు పడ్డారు. కొండల్లో దాగున్న సూర్యభగవానుడు కిరణాలు.. మంచు దుప్పటిని చీల్చుకుంటూ వస్తుంటే ప్రకృతి సోయగం చూసి స్థానికులు పరవశిస్తున్నారు.

కోనసీమను కమ్మేసిన పొగమంచు..

తూర్పు గోదావరి జిల్లా కోనసీమలో మంచుదుప్పటి దట్టంగా కమ్మేసింది. మామూలుగానే ప్రకృతి సోయగాలతో ఓలలాడే కోనసీమకు.. దట్టమైన మంచు అందాలు తోడవడం మరిన్ని సొగసులు అద్దుకుంది. సూర్యుణి లేలేత కిరణాల మధ్య... పచ్చటి పొలాల్లో మంచు అందాలు చూసి తీరాల్సిందే. ఎక్కడో శీతల ప్రాంతాల్లో కనిపించే దృశ్యాలు ఆవిష్కృతమై.. ఆనందాన్ని పంచుతున్నాయి.

కడపలో కనువిందు చేసిన పొగమంచు అందాలు..

కడప జిల్లా బద్వేలును పొగమంచు కప్పేసింది. తెల్లవారుజామున 5 గంటల నుంచి 7 గంటల వరకు తెల్లటి పాల నురుగులాంటి పొగమంచు కనువిందు చేసింది. అయితే దట్టంగా అలుముకున్న పొగమంచుతో రహదారి కనిపించక వాహనాల్లో వెళ్లేందుకు వాహనదారులు ఇబ్బందులు పడ్డారు. పట్టపగలే లైట్లు వేసుకొని ప్రయాణించారు. జిల్లాలో ఇంతటి పొగమంచు అలుముకోవటం ఇదే ప్రథమమని స్థానికులు అంటున్నారు.

అనంతలో అలరించిన పొగమంచు పరువాలు..

ఎక్కడో ఊటీ, కొడైకెనాల్​ వంటి శీతల ప్రాంతాల్లో కనిపించే పొగ మంచు దృశ్యాలు.. అనంతపురం జిల్లా ఉరవకొండ మండలంలో కనిపించి కనువిందు చేశాయి. అనంతపురం, బళ్ళారి 42వ జాతీయ రహదారిపై వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగినప్పటికీ.. రోజు చూసే ప్రాంతాలే పొగమంచు అందాలతో సరికొత్తగా కనిపించేసరికి స్థానికులు ఆ అందాలను ఆస్వాదించారు. ఉదయపు నడకకు వచ్చే వారు.. మైదాన్ని కప్పేసిన పొగమంచు అందాలు చూసి మురిసిపోయారు. పట్టణంలో ఇలాంటి సుందర దృశ్యాలను చూడటం ఇదే మొదటిసారంటూ సరికొత్త అనుభూతిని పొందారు.

ఇవీ చూడండి...

అంతర్జాతీయ పోటీలో సత్తా చాటిన విశాఖ

Last Updated : Nov 20, 2020, 12:55 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.