ETV Bharat / state

సింహాచల దేవస్థాన పూర్వపు ఈఈ మల్లేశ్వరరావు సస్పెండ్ - సింహాచల దేవస్థాన పూర్వపు ఈఈ మల్లేశ్వరరావు సస్పెండ్

విశాఖ సింహాచలం దేవస్థానం పూర్వపు ఈఈ మల్లేశ్వరరావు సస్పెండ్ అయ్యారు. ఈ మేరకు ఆలయ ఈవో భ్రమరాంబ ఉత్తర్వులు జారీచేశారు.

simhachalam temple ex ee malleswara rao suspend
సింహాచల దేవస్థాన పూర్వపు ఈఈ మల్లేశ్వరరావు సస్పెండ్
author img

By

Published : Aug 9, 2020, 1:47 PM IST

విశాఖ సింహాచలం దేవస్థానం పూర్వపు ఈఈ మల్లేశ్వరరావు సస్పెండ్ చేస్తూ.. ఆలయ ఈవో భ్రమరాంబ ఉత్తర్వులు జారీచేశారు. ప్రస్తుతం ఆయన కృష్ణా జిల్లా పెనుగంచిప్రోలు తిరుపతమ్మ దేవస్థానంలో పనిచేస్తున్నారు.

ఆయన సస్పెన్షన్​కు గల కారణాలను ఈవో వివరించారు. భైరవవాక సమీపంలోని సింహాచల ఆలయ భూములను అంతర్జాతీయ పాఠశాల నిర్మాణానికి ఓ సంస్థకు లీజుకు ఇచ్చారు. దాని ద్వారా వచ్చే ఆదాయంలో కొంత ఆలయానికి చేరేలా ఒప్పందం ఉంది. పాఠశాల నిర్మాణ పురోగతికి సంబంధించి దేవస్థానం ఛైర్​పర్సన్ సంచయిత గజపతి ఇటీవల నివేదిక కోరారు. అయితే పనులు పూర్తికాకుండానే పూర్తయినట్లు ఈఈగా ఉన్న మల్లేశ్వరరావు తప్పుడు నివేదిక ఇచ్చారు. ఈ విషయం గుర్తించి ఆయనను సస్పెండ్ చేశారు.

అయితే దీనిపై మల్లేశ్వరరావు స్పందిస్తూ.. తాను తప్పుడు నివేదిక ఇవ్వలేదన్నారు. 4 అంతస్థుల భవనం నిర్మించాల్సి ఉండగా.. 3 అంతస్థులు పూర్తయ్యాయని.. తాను ఆ విధంగానే నివేదిక ఇచ్చినట్లు వెల్లడించారు.

ఇవీ చదవండి...

అప్పన్న ట్రస్ట్ బోర్డు నూతన సభ్యురాలిగా పార్వతిదేవి ప్రమాణం

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.