ETV Bharat / state

'క్రేన్ డిజైనింగ్​లో లోపం వల్లే ప్రమాదం' - విశాఖ క్రేన్ డిజైనింగ్​లో లోపం వల్లే ప్రమాదం

విశాఖలోని షిప్‌యార్డ్ ప్రమాదంపై నిపుణుల కమిటీ నివేదిక సమర్పించింది. క్రేన్‌ డిజైనింగ్‌లోనే లోపాలున్నట్టు గుర్తించింది. లోడ్‌ టెస్టింగ్‌కు అనుమతులు తీసుకోలేదని కమిటీ తెలిపింది.

shipyard experts
shipyard experts
author img

By

Published : Aug 12, 2020, 8:12 AM IST

విశాఖ హిందుస్థాన్‌ షిప్‌యార్డులో ఈ నెల ఒకటిన జరిగిన ప్రమాదంపై నిపుణుల కమిటీ.. తన నివేదికను జిల్లా కలెక్టర్‌ వినయ్‌చంద్‌కు సమర్పించింది. క్రేన్‌ డిజైనింగ్‌లోనే లోపాలున్నట్టు తేల్చిచెప్పింది. ఏయే ప్రమాణాలు పాటించారు, ఏ రకమైన క్రేన్‌ రూపొందించారు, తీసుకున్న జాగ్రత్తలేంటన్న అంశాలన్నింటినీ నిపుణుల కమిటీ సమగ్రంగా పరిశీలించింది. లోడ్‌ టెస్టింగ్‌కు తీసుకోవాల్సిన కొన్ని కచ్చితమైన అనుమతులను తీసుకోలేదని గుర్తించింది. నిపుణుల కమిటీ నివేదిక ఆధారంగా.. షిప్‌యార్డ్‌ యాజమాన్యంపై చర్యలు తీసుకునే అవకాశముంది.

ఇదీ చదవండి: 'తెలంగాణకు అడ్డు చెప్పరు... మమ్మెల్నెలా వద్దంటారు?'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.