Sendoff to president: విశాఖలో రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ పర్యటన నేటితో ముగిసింది. ప్రెసిడెంట్ ఫ్లీట్ రివ్యూలో భాగంగా.. విచ్చేసిన ఆయన మూడు రోజుల పాటు విశాఖలో బస చేశారు. ఇవాళ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ నావల్ ఎయిర్ బేస్ ఐఎన్ఎస్ డేగలో ఆయనను కలిసి పుష్పగుచ్ఛం అందజేసి వీడ్కోలు పలికారు. అనంతరం రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ దంపతులు దిల్లీకి బయలుదేరి వేళ్లారు.
రాష్ట్రపతికి వీడ్కోలు సమయంలో.. గవర్నర్ సహా శాసనసభాపతి తమ్మినేని సీతారాం, మంత్రి అవంతి శ్రీనివాస్, విశాఖ మేయర్ గొలగాని హరి వెంకట కుమారి, ఎంపీలు, ఎమ్మెల్యేలు, పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
ఇదీ చదవండి: YS Viveka Murder Case: వివేకా హత్య కేసు విచారణ కడప జిల్లా కోర్టుకు బదిలీ