ETV Bharat / state

విశాఖలోని కాపులుప్పాడ కొండపై సచివాలయం!

author img

By

Published : Mar 6, 2020, 7:37 AM IST

విశాఖపట్నంలోని మధురవాడలో మిలీనియం టవర్స్‌కు అత్యంత సమీపంలో ఉన్న కాపులుప్పాడ కొండపై సచివాలయం ఏర్పాటుపై వైకాపా పెద్దలు సమాలోచనలు జరుపుతున్నారు. డేటాపార్కు ఏర్పాటుకు అదానీ సంస్థకు గత ప్రభుత్వం ఈ కొండ ప్రాంతాన్ని కేటాయించింది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఆ సంస్థకు మరోచోట స్థలం కేటాయించాలని రాష్ట్ర ప్రభుత్వం ఆలోచిస్తోంది.

secretariat-on-the-hill-of-kapuluppada-dot-dot-dot
కాపులుప్పాడ కొండపై సచివాలయం...!

విశాఖపట్నంలోని మధురవాడలో మిలీనియం టవర్స్‌కు అత్యంత సమీపంలో ఉన్న కాపులుప్పాడ కొండపై సచివాలయం నిర్మిస్తే ఎలా ఉంటుందన్న అంశంపై వైకాపా పెద్దలు సమాలోచనలు జరుపుతున్నారు. మిలీనియం టవర్స్‌లో సచివాలయం ఏర్పాటుకు తొలుత ఆలోచించారు. ఐటీ రంగ ప్రముఖులు, ప్రతిపక్షాల నుంచి తీవ్ర వ్యతిరేకత వస్తుండటంతో దానికి ప్రత్యామ్నాయంగా మరోచోట సచివాలయం ఏర్పాటు చేస్తే ఎలా ఉంటుందని ఆలోచిస్తున్నారు. మిలీనియం టవర్స్‌కు సమీపంలో కాపులుప్పాడ కొండపై ఐటీ సంస్థల కోసం గత ప్రభుత్వం ఐటీ లేఅవుట్‌ను రూపొందించింది. అదానీ సంస్థ ఆ కొండపై డేటాపార్క్‌ ఏర్పాటు చేస్తామని ప్రకటించడంతో ఆ కొండ మొత్తాన్ని అదానీ సంస్థకే కేటాయించారు. కానీ ఆ సంస్థ పెట్టబోయే పెట్టుబడి విషయంలో గందరగోళం తలెత్తింది. తాము రూ.70వేల కోట్లు పెట్టుబడులు పెడతామనలేదని, కేవలం రూ.3వేల కోట్ల పెట్టుబడులే పెడతామని రాష్ట్ర ప్రభుత్వానికి ప్రణాళిక ఇచ్చింది. ఈ నేపథ్యంలో ఆ పెట్టుబడికి అనుగుణంగా మరోచోట స్థలం కేటాయించాలని రాష్ట్ర ప్రభుత్వం ఆలోచిస్తోంది. కాపులుప్పాడ కొండ మొత్తాన్ని సచివాలయం, రాష్ట్ర ప్రభుత్వ కార్యాలయాల నిర్మాణానికి వినియోగించాలని భావిస్తున్నారు. కాపులుప్పాడ కొండలపై మొత్తం 1350 ఎకరాల స్థలం అందుబాటులో ఉంది. ఇప్పటికే 250 ఎకరాల విస్తీర్ణంలో లేఅవుట్‌ వేయగా 175 ఎకరాల స్థలం అందుబాటులోకి వచ్చింది. ఆ కొండకు ఆనుకుని ఉన్న ఇతర కొండల భాగాలనూ చదును చేసి మరో 600 ఎకరాల భూమిని వినియోగంలోకి తీసుకురావొచ్చని ఏపీఐఐసీ అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ ప్రాంతంలోనే యుద్ధ ప్రాతిపదికన సచివాలయం, ఇతర భవనాల నిర్మాణం చేపడితే భవిష్యత్తు అవసరాలకు ఉపయుక్తంగా ఉంటుందని ఆలోచిస్తున్నారు.
సీఎం సతీమణి వైఎస్‌ భారతి రాక
ముఖ్యమంత్రి సతీమణి వైఎస్‌ భారతి విశాఖలో (నివాసయోగ్య భవనాలను చూడటానికి ఇటీవలే విశాఖ వచ్చిన విషయం వైకాపా వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. నగరంలోని నౌకాశ్రయ అతిథి గృహం, రుషికొండలోని కొన్ని భవనాలను, భీమిలిలోని జూట్‌మిల్లు అతిథి గృహాన్ని (ఓషన్‌ వ్యూ బంగ్లా) ఆమె సందర్శించారని సమాచారం.

ఇదీ చూడండి:ఉపమాక వెంకన్న కల్యాణానికి అధికారుల ఏర్పాట్లు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.