విశాఖ జిల్లా నర్సీపట్నం సబ్ డివిజన్ పరిధిలో వివిధ శాఖల అధికారులు పర్యటించారు. నాతవరం నర్సీపట్నం , గొలుగొండ , మాకవరపాలెం , తదితర ప్రాంతాల్లోని ఇసుక సేకరణ రీచ్‌లను వారు పరిశీలించారు. ప్రభుత్వ పరంగా చేపడుతున్న నిర్మాణాలకు సంబంధించి అవసరమైన అనుమతులు తీసుకోవాలని సూచించారు.
ఇటీవల కురిసిన వర్షాలకు రీచ్‌లలో ఇసుక లభ్యత.. వాటి తవ్వకాలపై ఆరా తీశారు. ఇందుకు సంబంధించి మండల తహసీల్దార్ కార్యాలయంలో అనుమతులకోసం ఎలాంటి నిబంధనలు పాటించాలి అనే అంశాలపై మార్గదర్శకాలను జారీ చేశామన్నారు.
ఇదీ చూడండి. గుంటూరు జైలు వద్ద ఉద్రిక్తత.. నిరసనకారుల అరెస్ట్