విశాఖ ఏజెన్సీ హుకుంపేట పోలీస్ స్టేషన్ పరిధిలో ఎస్ఐ అప్పలనాయుడు ఆధ్వర్యంలో కరోనా కట్టడికి గిరిజనులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. కరోనా కేసులు రోజురోజుకు పెరుగుతుండడంతో హుకుంపేట పరిసర గ్రామాల ప్రజలకు అవగాహన కల్పిస్తూ.. ప్రజల చేత ప్రతిజ్ఞ చేయించారు.
"నేను నా కుటుంబ సభ్యులతో కలిసి 21 రోజులపాటు ప్రతిరోజు 3-5 నిమిషాల పాటు ఆవిరి పీలుస్తాను.. రోజుకు మూడు సార్లు ఉప్పు నీరు పుక్కిలిస్తాను.. ఆరోగ్యకరమైన బలవర్ధకమైన ఆహారం తీసుకుంటాను.. అందరికీ భౌతిక దూరంలో ఉంటూ మాస్క్ పెట్టుకుంటాను"
ఈ విధంగా పోలీసులు గిరిజనుల చేత పలు గ్రామాల్లో ప్రతిజ్ఞ చేయించారు. మన్యంలో కరోనా కట్టడికి పోలీసులు అవగాహన కల్పిస్తున్నారు.
ఇదీ చదవండి అనకాపల్లిలో జనం రద్దీ... కరోనాను లెక్కచేయని ప్రజలు