ETV Bharat / state

వాడిన పూలు వికసించాయి... పరిమళాలు వెదజల్లాయి... - 'గ్రీన్ వేవ్స్' ఎన్విరాన్ మెంటల్ సొల్యూషన్స్ సంస్థ తాజా వార్తలు

పూలు వాడిపోతాయి.. కానీ తిరిగి వికసిస్తాయి. పరిమళాలను వెదజల్లుతాయి. సుగంధ వాసనలతో మనసును కట్టిపడేస్తాయి. అదేలా అనుకుంటున్నారా.. వాడిన పూలు సైతం ఇప్పుడు విలువైనవే కాబట్టి. విశాఖలో పర్యావరణ పరిరక్షణ దిశగా పని చేస్తున్న ఓ సంస్థ వినూత్న ఆలోచనతో పూల వ్యర్థాలతో.. నూతన వస్తువులను తయారు చేస్తూ ఆకట్టుకుంటోంది. ఆ సంస్థ విశేషాలు ఈటీవీ భారత్​లో...

preparation of agarabathis with waste flowers at visakhapatnam by 'Green Waves' environmental mental solutions company.
వాడిన పూలతో అగర్‌ బత్తీలు..ఆదాయానికి మంచి వనరు!
author img

By

Published : Feb 28, 2020, 4:28 PM IST

Updated : Mar 3, 2020, 3:51 PM IST

వాడిన పూలతో అగర్‌ బత్తీలు..ఆదాయానికి మంచి వనరు!

చామంతులు, బంతి పూలు, గులాబీలు, సంపంగి పూలు, మల్లెలు, మందార పూలు... ఒక రోజు పూజ కోసమో, అలంకరణ కోసమో వినియోగిస్తే వాడిపోతాయి. తరువాత అవి వ్యర్థాలుగా మారిపోతాయి. వాడిన పూలు సైతం ఉపయోగపడతాయని అంటోంది విశాఖకు చెందిన 'గ్రీన్ వేవ్స్' ఎన్విరాన్ మెంటల్ సొల్యూషన్స్ సంస్థ. వాడినపూలతో సుగంధ పరిమళాలు వెదజల్లుతోంది ఈ సంస్థ. మనసుకు ఆహ్లాదాన్ని సుగంధభరితమైన వాసనలు వెదజల్లే అగర్ బత్తీలు, దూప్ కడ్డీలు తయారు చేస్తోంది. ఎలక్ట్రానిక్ ఉపకరణాలను నుంచి వచ్చే వ్యర్థాలను శాస్త్రీయంగా వేరు చేయాలనే ఆలోచనతో గ్రీన్ వేవ్స్​ను నెలకొల్పారు అనీల్. పర్యావరణ హితంగా ఉండాలన్న ఆలోచనలకు మరింత పదునుపెట్టి ఇప్పుడు జీరో వేస్ట్ సూత్రంతో ఈ సరికొత్త ఆలోచనను ఆచరణలో పెట్టారు. తొలి దశలో కొన్ని దేవాలయాలతో ఒప్పందం చేసుకుని పూలు, కొబ్బరి కాయల నుంచి వచ్చే వ్యర్థాల ద్వారా పర్యావరణ హిత వస్తువులను, పదార్థాలను తయారు చేస్తున్నారు. దేవాలయం నుంచి బయటకు వచ్చే వ్యర్థాలను పూర్తి స్థాయిలో వినియోగించుకోవడం ద్వారా ఓవైపు ఆదాయ మార్గాన్ని కల్పించుకుంటూ, మరోవైపు ప్రకృతి ధర్మాన్ని కాపాడుతున్నారు.

ఒక్క అగర్ బత్తీల తయారీకి మాత్రమే పరిమితం కాకుండా వివిధ రకాల ఉత్పత్తులను తయారు చేస్తున్నారు. జీవీఎంసీ అధికారులు సైతం 'గ్రీన్ వేవ్స్' సంస్థ వినూత్న ఆలోచనను ప్రోత్సహిస్తున్నారు. నగరంలో మార్కెట్​లు, దేవాలయాలు, వేడుకల ప్రదేశాల నుంచి వచ్చే పూల వ్యర్థాలను ఈ విధంగా వినియోగిస్తే ఉత్తమ ఫలితాలు ఉంటాయని చెబుతున్నారు.

ఈ ప్రయత్నాన్ని మరింత ముందుకు తీసుకువెళ్లే ఉద్దేశంతో 'గ్రీన్ వేవ్స్' పని చేయనుంది. సామాజిక బాధ్యతగా వివిధ ప్రదేశాల్లోని మహిళలకు పూల వ్యర్థాల నుంచి అగర్ బత్తీల తయారీపై శిక్షణ ఇవ్వనున్నారు. ఎలాంటి యంత్ర పరికరాలు లేకుండా కేవలం చేతితో చేయగలిగే అవకాశం ఉన్నందున... ఇంటిలో ఉండగానే చిన్న పాటి పరిశ్రమగా ఈ ప్రయోగం నుంచి ఆదాయాన్ని దక్కించుకోవచ్చని సంస్థ యజమానులు చెబుతున్నారు.

ఇదీ చదవండి: నూక తాత జాతర... ఆ పాదం తాకితే నిజమైన సంబరం...

Last Updated : Mar 3, 2020, 3:51 PM IST

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.