విశాఖ జిల్లా అనకాపల్లి మండలం తగరంపూడి గ్రామంలో ఓ గర్భిణి అనుమానాస్పదస్థితిలో మృతిచెందింది. గ్రామానికి చెందిన మంత్రి రమేష్‌తో .. రమ అనే మహిళకు వివాహమైంది. వీరికి ఏడాది వయస్సున్న కుమార్తె ఉండగా.. రమ ఇప్పుడు ఆరునెలల గర్భవతి. ఈ నెల 22న ఆమెకు కడుపునొప్పి రావడంతో..23న అనకాపల్లి ఆసుపత్రికి తరలించారు. ఏమైందో ఏమో .. చికిత్స చేస్తుండగానే రమ్య మృతిచెందిందని వైద్యులు తెలిపారు. ఆమె మృతిపై అనుమానాలున్నాయంటూ.. బంధువులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
ఇదీ చూడండి. అందుకే నలంద కిశోర్‌ను అరెస్ట్ చేశారు: ముత్తంశెట్టి