ETV Bharat / state

RAINS IN AGENCY: మన్యంలో భయంకర పరిస్థితి.. వాగు దాటేందుకు తీవ్ర కష్టాలు - వర్షాలు

ఉపరితల ఆవర్తనం, అల్పపీడనం వల్ల రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. భారీ వర్షాలకు విశాఖ జిల్లా ఏవోబీలో వాగులు పొంగి పొర్లుతున్నాయి. మాములు సమయాల్లోనే రహదారులు లేని ప్రజలు.. ఇప్పుడు వర్షాల వల్ల అష్టకష్టాలు పడుతున్నారు. ఆ ప్రాంతాలకు కనీసం బైకులు, అంబులెన్సులు వెళ్లలేని పరిస్థితి. వాగులు ఉద్ధృతంగా ప్రవహిస్తుండటం వల్ల ప్రాణాలు కాపాడుకోవడానికి వాటిపైనుంచే వెళుతున్నారు. మన్యంలో ఓ గర్భిణీ ..నొప్పులు రావడంతో డోలీలోనే ఆమెను వాగు దాటించారు.

pregnant lady  faced problems due to heavy rains at visakha agency
వాగులో చిక్కుకున్న గర్భిణీ
author img

By

Published : Jul 23, 2021, 2:17 PM IST

Updated : Jul 23, 2021, 2:24 PM IST

భారీ వర్షాలకు విశాఖ మన్యంలోని గిరిజనులు తీవ్ర అవస్ఖలు ఎదుర్కొంటున్నారు. సాధారణ సమయాల్లోనే డోలీలో ప్రయాణాలు చేస్తూ ప్రాణాలు కాపాడుకుంటారు. ఇప్పుడు పరిస్థితి అలా లేదు. కొెండల్లోని వాగులు ఉద్ధృతంగా ప్రవహిస్తున్నాయి. ఇన్నిరోజులు వాటిపైనుంచి దాటేవారు. ఇప్పుడు వాగులు ఉప్పొంగడటంతో..వారు ఇబ్బందులు పడుతున్నారు. విశాఖ మన్యంలో వరదల్లో నిండు గర్భిణి చిక్కుకుంది. డోలీ వాగులోనే పడిపోవడంతో.. కోరుకొండ పీహెచ్​సీకి తరలించేందుకు కుటుంబ సభ్యులు కష్టాలుపడ్డారు. ఎండిన చెట్టు సాయంతో ఆమెను గడ్డెకి ఎక్కించారు.

మన్యంలో కష్టాలు

విశాఖ మ‌న్యం చింత‌ప‌ల్లి మండ‌లం బలపం పంచాయతీ బూరుగుబయలు నుంచి ఓ బాలింతను ఆస్పత్రికి తీసుకెళ్లేందుకు అతికష్టం మీద వాగును దాటించారు. గ్రామానికి చెందిన వూలంగి విజయలక్ష్మి(28) ఆడ శిశువుకు జన్మనిచ్చింది. బాలింత నిరసంగా ఉండడంతో కుటుంబ సభ్యులు ఆమెను, శిశువుని కోరుకొండ పీహెచ్‌సీకి తరలించేందుకు డోలిలో మోసుకెళ్లారు. బూరుగుబయలు వాగు ఉద్ధృతంగా ప్రవహిస్తుండటంతో.. గ్రామానికి అంబులెన్స్‌ వచ్చే పరిస్థితి లేదు. దీంతో కుటుంబసభ్యులు నడుములోతులో ప్రవహిస్తున్న వాగును అతి కష్టంపై దాటించాలనుకున్నారు.

అయితే వ‌ర్షాలు ప‌డుతుండ‌టంతో వాగు ఉద్ధృతంగా.. ప్రవహిస్తోంది. వాళ్లు ధైర్యం చేసి.. ప్రాణాలు కాపాడుకోవడానికి వాగులోకి దిగారు. దీంతో వాగులో బాలింత‌ను తీసుకువ‌స్తున్న డోలీ చిక్కుకుంది. అప్పుడు వారు ఎండిన చెట్టును ఆధారంగా చేసుకుని గడ్డనుంచి బయటికి వచ్చారు. ఆ తర్వాత బాధితురాలని కోరుకొండ పీహెచ్‌సీకి తీసుకెళ్లారు. స్థానిక వైద్యాధికారి సురేష్‌కుమార్‌ ప్రాథమిక పరీక్షలు నిర్వహించి.. అంబులెన్స్‌లో చింతపల్లి ఆస్పత్రికి తరలించారు. తల్లి, బిడ్డ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. బాలింత, శిశువు ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. తమ గ్రామానికి రహదారి సదుపాయం లేక ఇబ్బందులు పడుతున్నామని బాలింత విజయలక్ష్మి ఆవేదన వ్యక్తం చేసింది.

ఇదీ చూడండి.

rains: ప్రమాదకరంగా పెద్దవాగు..రాకపోకలకు ఇబ్బందులు

Last Updated : Jul 23, 2021, 2:24 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.