విశాఖ జిల్లాలో వీధి బాలలను కరోనా నుంచి రక్షించే చర్యల్లో భాగంగా చేపట్టిన ‘ఆపరేషన్ ముస్కాన్’ కొనసాగుతోంది. నగర పోలీస్ కమిషనర్ ఆర్కే మీనా ఆధ్వర్యంలో అధికారులు రహదారులపై యాచకులు, నిరాశ్రయులుగా ఉంటున్న 16 మంది చిన్నారులను గుర్తించారు. చిన్నారులకు మాస్క్‌లు, శానిటైజర్లు, విటమిన్ మాత్రలు అందించారు. అనంతరం సీడబ్ల్యూసీ చైర్ పర్సన్, లేబర్ ఆఫీసర్ ముందు హాజరు పరిచి కొవిడ్-19 లక్షణాలు ఉన్న పిల్లలకు కరోనా పరీక్షలు నిర్వహించారు. గుర్తించిన చిన్నారులను వారి తల్లిదండ్రుల వద్దకు పంపడం, తల్లిదండ్రులు లేని వారిని వసతి గృహంలో అప్పగిస్తామని పోలీసులు వెల్లడించారు.
ఇదీ చదవండి: