మారిన రైలు వేళలు రేపటి నుంచి దేశవ్యాప్తంగా అమల్లోకి రానున్నాయి. ప్రతి రైల్వే డివిజన్లోనూ ఒకటి రెండు రైళ్లు తప్ప మిగిలిన అన్ని రైళ్ల సమయాల్లో 10 నుంచి అరగంట వరకు మార్పు వచ్చింది. రేపటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త వేళలు అమలవుతాయి.
రైల్వే అధికారిక వెబ్ సైట్లో మారిన రైళ్ల సమయాలు అందుబాటులో ఉన్నాయి. స్టేషన్లలోనూ కొత్త సమయాలను రైల్వే శాఖ ప్రదర్శిస్తోంది. తూర్పు కోస్తా రైల్వేలో డివిజన్ల వారీగా కొత్త సమయాలను అధికారులు విడుదల చేశారు. కొవిడ్ కారణంగా నడుపుతున్న ప్రయాణికుల రైళ్లన్నంటిని ప్రత్యేక రైళ్లగానే పరిగణిస్తున్నారు. విశాఖ జిల్లా వాల్తేర్ డివిజన్లో 2, 3 రైళ్లు మాత్రమే సమయాలు మారకుండా ఉన్నాయి. మిగిలినవన్నీ కొత్త సమయం ప్రకారమే నడుస్తాయి.
ఇవీ చదవండి..