విశాఖలో డీఆర్డీవో ఆధ్వర్యంలో జాతీయ సైన్స్ దినోత్సవం నిర్వహించారు. నేవల్ సైన్స్ అండ్ టెక్నాలజీ లేబొరేటరీలో జరిగిన కార్యక్రమానికి ఆంధ్ర విశ్వవిద్యాలయం మాజీ ఉపకులపతి ఆచార్య సత్యనారాయణ ముఖ్య అతిధిగా హాజరయ్యారు. శాస్త్ర సాంకేతిక రంగాలు సాధించిన పురోగతి... దేశాభివృద్ది సూచికలలో ఒకటిగా ఉంటుందని ఆచార్య సత్యనారాయణ వ్యాఖ్యానించారు. నేటి తరం దీనిని చక్కగా అవగతం చేసుకోవాలని పిలుపునిచ్చారు.
ఇదీచదవండి