పింఛనుదారులు సమస్యలపై కేంద్ర ప్రభుత్వం దృష్టి సారించాలనే ఉద్దేశంతో అఖిలభారత ఈపీఎస్ పెన్షనర్ల సంఘర్షణ సమితి రాష్ట్ర కార్యదర్శి ఈఈఎల్.మురళీకృష్ణ ద్విచక్రవాహనంపై గుంటూరు నుంచి వారణాసి యాత్ర నిర్వహిస్తున్నారు. యాత్రలో భాగంగా విశాఖ చేరుకుని వైజాగ్ జర్నలిస్ట్ ఫోరం ప్రెస్ క్లబ్ల్లో మాట్లాడారు.
కనీస పింఛను 7,500 రూపాయలు కరవు భత్యం తో పాటు ఇవ్వాలని.. ఉన్నత స్థాయి పింఛను సుప్రీం కోర్టు తీర్పు ప్రకారం అమలు చేయాలని మురళీకృష్ణ డిమాండ్ చేశారు. పింఛనర్ల జీవిత భాగస్వామికి ఉచిత వైద్య సదుపాయం కల్పించాలన్నారు. ఈ సమస్యను కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకువచ్చేందుకు ప్రధాని మోదీ, ఎంపీ హేమమాలినిని పెన్షనర్ల సంఘర్షణ సమితి జాతీయ అధ్యక్షుడు అశోక్ రావు రౌతు, కార్యదర్శి వీరేంద్ర సింగ్ కలిసి విజ్ఞప్తి చేశారని మురళీకృష్ణ తెలిపారు.
మురళీ కృష్ణ ప్రయాణం :
మురళీ కృష్ణ గుంటూరు లో బయలుదేరి ఆర్టీసీ పింఛను దారులను ఇతర పదవీ విరమణ చేసిన ఉద్యోగులను కలుసుకుంటూ విజయవాడ, ఏలూరు, తుని మీదుగా విశాఖ చేరుకున్నారు. అనంతరం విశాఖ నుంచి ఒడిశా మీదుగా పలు రాష్ట్రాలను సందర్శిస్తూ వారణాసి చేరుకోనున్నారు.
ఇదీ చదవండి :