విశాఖ జిల్లా అనకాపల్లి నియోజకవర్గంలోని టిడ్కో గృహాలను విశాఖ దక్షిణ నియోజకవర్గంలోని వారికి వైకాపా ప్రభుత్వం ఇవ్వాలని చూస్తోందని తెదేపా ఎమ్మెల్సీ బుద్ధ నాగ జగదీశ్వరరావు అన్నారు. అనకాపల్లిలోని గృహాలు వేరే నియోజకవర్గంలోని వారికి ఇవ్వాలనుకోవడం దారుణమని ఆగ్రహం వ్యక్తం చేశారు.
అనకాపల్లిలో నవశకం పేరుతో సర్వే చేయగా 4500 మంది లబ్ధి దారులు ఉన్నట్టుగా తేలిందని.. వీరికి గృహాలు ఇచ్చిన తర్వాతే మిగిలిన ప్రాంతవాసులకు ఇవ్వాలని జగదీశ్వరరావు డిమాండ్ చేశారు. ఈ విషయమై రేపటి నుంచి జీవీఎంసీ అనకాపల్లి జోనల్ కార్యాలయం వద్ద నిరసన దీక్ష చేపట్టనున్నట్లు తెలిపారు. పేదలకు ఇళ్లు కేటాయించే వరకు పోరాటం చేస్తామన్నారు.
ఇదీ చదవండి:
కెరీర్ చివరిలో ఇలాంటి పిటిషన్ ఎదుర్కోవాల్సి వచ్చింది: జస్టిస్ రాకేష్ కుమార్