నరసాపురం ఎంపీ రఘురామకృష్ణమరాజుకి పౌరుషం ఉంటే ఆయన తన పదవికి రాజీనామా చేయాలని మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు సవాలు విసిరారు. విశాఖలో మంత్రి మాట్లాడుతూ ప్రజాధనం ఆదా చేయాలన్న ఉద్దేశ్యంతో ప్రభుత్వం విశాఖలో అతిథి గృహం నిర్మాణానికి నిర్ణయిస్తే దానికి వ్యతిరేకంగా కేంద్ర మంత్రికి లేఖ రాశారని అన్నారు. చంద్రబాబు ఇచ్చిన స్క్రిప్ట్ నే రఘురామకృష్ణంరాజు చదువుతున్నారని ఆరోపించారు. అసలు తొట్లకొండ, బావికొండ ఎక్కడివుందో ఆయనకు తెలియదని మంత్రి అన్నారు. రాష్ట్రంలోచారిత్రాత్మక ప్రదేశాలను ప్రభుత్వం పరిరక్షిస్తుందని మంత్రి తెలిపారు.
ఇదీ చదవండి: విశాఖలో మైక్రోసాఫ్ట్, అమెజాన్ డేటా కేంద్రాలు?