భర్త వేధింపులు భరించలేక వివాహిత ఉరి వేసుకుని బలవన్మరణానికి పాల్పడిన ఘటన విశాఖ జిల్లా పాయకరావుపేట పట్టణంలో జరిగింది. ప్రకాశం జిల్లాకు చెందిన ఎరువ మౌనికకు శ్రీకాంత్ రెడ్డితో ఏడాది క్రితం వివాహం జరిగింది. అదనపు కట్నం తెమ్మని భర్త వేధించడంతో ఆమె చున్నీతో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. బాధితురాలి బంధువుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఇదీ చదవండి: నష్టాల నుంచి పుంజుకుంటున్న ఆర్టీసీ...