ETV Bharat / state

విశాఖ జిల్లాలో రెండో రోజు నామినేషన్ల కోలాహలం

author img

By

Published : Jan 30, 2021, 7:03 PM IST

స్థానిక సంస్థల ఎన్నికలకు నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం కావడంతో విశాఖ జిల్లాలోని మండలాల్లో కోలాహలం నెలకొంది. రెండో రోజూ అభ్యర్థులు పెద్దఎత్తున నామినేషన్లు దాఖలు చేశారు. గ్రామీణ ప్రాంతాల్లో ఎన్నికల వాతావారణం వేడి పుట్టిస్తోంది.

nominations in visaka district
విశాఖ జిల్లాలో రెండో రోజు నామినేషన్ల కోలాహలం

చోడవరం నియోజకవర్గంలో..

విశాఖ జిల్లా చోడవరం నియోజకవర్గంలో నామినేషన్ల ప్రక్రియలో భాగంగా రెండోరోజు మధ్యాహ్నం వరకు 189 నామినేషన్లు దాఖలయ్యాయి. చోడవరంలో అభ్యర్థులు తమ మద్దతు దారులతో తరలివెళ్లి నామినేషన్లు వేశారు.

వైకాపా, తెదేపా పార్టీలు తమ సర్పంచి అభ్యర్థులను దాదాపుగా ఇప్పటికే ఖరారు చేశాయి. చోడవరం సర్పంచి అభ్యర్థిగా వైకాపా మద్దతుదారు జింజారి మణి రాయపురాజుపేటలో, బొడ్డేడ అభ్యర్థులుగా వైకాపా నుంచి సూర్యనారాయణ.. తెదేపా నుంచి రామునాయుడు నామినేషన్లు దాఖలు చేశారు. మండలంలో రెండు పంచాయతీలలో జరగాల్సిన ఏకగ్రీవ ఎన్నికల చర్యలను జనసేన అడ్డుకుంది.

మాడుగుల నియోజకవర్గంలో..

విశాఖ జిల్లా మాడుగుల నియోజకవర్గంలోని మాడుగుల, చీడికాడ, కె.కోటపాడు, దేవరాపల్లి మండలాల్లోని పంచాయతీ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ రెండోరోజూ కొనసాగింది. నియోజకవర్గంలోని నాలుగు మండలాల్లో శనివారం సర్పంచ్, వార్డు స్థానాలకు అభ్యర్థులు పెద్దఎత్తున నామినేషన్లు దాఖలు చేశారు. నామినేషన్లు దాఖలు చేయడానికి మద్దతుదారులు గ్రామాల్లో ర్యాలీలు నిర్వహించారు. గ్రామీణ ప్రాంతాల్లో ఎన్నికల కోలాహలం నెలకొంది.

ఇదీ చదవండి:

స్థానిక ఎన్నికల్లో వైకాపాకు బుద్ధి చెప్పాలి: అయ్యన్న

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.