ETV Bharat / state

LG polymers: రెండేళ్లయినా.. పట్టించుకోని ప్రభుత్వం..

LG polymers tragedy: ఆ రోజు.. అర్ధరాత్రి దాటాక ఉన్నట్టుండి చాలామందికి ఊపిరి ఆడలేదు. ఏదో ఘాటైన వాసన వస్తోందని బయటకు వచ్చారు. వచ్చినవాళ్లు వచ్చినట్లు కింద పడిపోతున్నారు. పిల్లలను ఎత్తుకుని బయటకు వచ్చిన ఓ తల్లి.. వాళ్లతో సహా గుమ్మం ముందే పడిపోయింది. వాహనాల మీద వెళ్లేవారు, కాలినడకన తప్పించుకోవాలని చూసినవారు అందరిదీ అదే పరిస్థితి.

lg polymers tragedy
lg polymers tragedy
author img

By

Published : May 7, 2022, 8:44 AM IST

LG polymers tragedy: రెండేళ్ల క్రితం సరిగ్గా ఇదే రోజు (మే 7) విశాఖ సమీపంలో ఎల్‌జీ పాలిమర్స్‌ పరిశ్రమ నుంచి లీకైన స్టైరీన్‌ విషవాయువు ప్రభావమది. ఈ దుర్ఘటనలో 12 మంది ప్రాణాలు కోల్పోగా.. వేల మంది ప్రజలు ఊపిరాడక అల్లాడిపోయారు. చాలామంది నిద్రలోనే అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయారు. వాళ్లందరినీ తాము ఆదుకుంటామని ప్రభుత్వం మహాగొప్పగా చెప్పింది. సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రి కట్టిస్తామంది. ఆరోగ్య కార్డులు ఇస్తామని.. వాటితో ఎక్కడైనా, ఎన్నాళ్లైనా వైద్యం చేయించుకోవచ్చంది.

ఆ ప్రాంతంలో ఆర్వో ప్లాంటు ఏర్పాటుచేసి అందరికీ సురక్షిత తాగునీరు అందిస్తామంది. అప్పటికప్పుడు పరిహారం చెల్లించి చేతులు దులిపేసుకోవడం తప్ప.. రెండేళ్లవుతున్నా వారిని పట్టించుకున్న పాపాన పోలేదు. వారు ఏమైపోయారో.. ఆ ప్రాంత వాసులకు ఏమవుతోందో తెలుసుకునే దిక్కు లేదు. కాసేపు మాట్లాడితే ఆయాసం.. తరచు దగ్గు.. కొద్ది దూరం నడిచినా అలసట. శరీరంపై మచ్చలు, దద్దుర్లు, కడుపులో మంట, ఒళ్లు నొప్పులు, కళ్లు మంటలు... రెండేళ్ల తర్వాత కూడా విశాఖపట్నం సమీపంలోని వెంకటాపురం వాసులకు ఈ బాధలు తప్పడం లేదు. పరిశ్రమకు సమీపంలో ఉన్నవాళ్లు, స్టైరీన్‌ గ్యాస్‌ను అధికంగా పీల్చినవారిని ఎక్కువగా చర్మ, జీర్ణకోశ, శ్వాస సంబంధ సమస్యలు బాధిస్తున్నాయి.

వారి మాటలు.. నీటిమూటలే: ఎల్‌జీ ఘటన తర్వాత ఈ ప్రాంతవాసులను ఆదుకోడానికి చాలా చేస్తామని ప్రభుత్వం హామీలు గుప్పించింది. నాటి మంత్రులూ ఇక్కడ అది చేస్తాం, ఇది చేస్తామన్నారు. తీరాచూస్తే.. రెండేళ్లవుతున్నా వాటి ఊసు లేదు. వెంకటాపురంలో సూపర్‌స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మిస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చింది. అది ఏమైందో ఇంతవరకూ తెలియదు. తాత్కాలికంగా వైఎస్సార్‌ హెల్త్‌క్లినిక్‌ను అక్కడ ప్రారంభించారు.

దీనికోసం ఆర్భాటంగా అప్పటి మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. కొన్నాళ్లకు శిలాఫలకమూ మాయమైంది. గ్రామంలోని పాఠశాలలో కొన్నాళ్లు వైఎస్‌ఆర్‌ హెల్త్‌క్లినిక్‌ పేరుతో ఆరోగ్య కేంద్రం నిర్వహించారు. కొవిడ్‌ అనంతరం పాఠశాలలు తెరిచాక ఆరోగ్యకేంద్రం మూతపడింది. దానికి సంబంధించిన సామగ్రిని ఓ గదిలో పడేసి తాళాలు వేశారు. కనీసం అక్కడ బీపీ యంత్రం కూడా లేదని గ్రామస్థులు చెప్పారు.

  • ఆరోగ్య కార్డులు ఇస్తామని ప్రభుత్వం చెప్పింది. వాటితో ఎక్కడైనా వైద్యం చేయించుకోవచ్చని పేర్కొంది. దాని గురించి తర్వాత పట్టించుకోలేదు. సీఎం జగన్‌ ఫొటోతో కొందరికి 20 పేజీల పుస్తకం ఇచ్చారు. ఎవరెవరికి ఇచ్చారో కనీసం వారి పేర్లయినా నమోదు చేయలేదు. అలా ఇచ్చినవి కూడా ఇప్పుడు దేనికీ ఉపయోగపడడం లేదంటున్నారు.
  • గ్రామంలో ఆర్‌వో ప్లాంటు ఏర్పాటు ప్రతిపాదనకే పరిమితమైంది. వెంకటాద్రి గార్డెన్స్‌లోని రెండు వీధుల్లో తప్ప మిగిలిన చోట ఎక్కడా రక్షిత తాగునీటి సరఫరా లేదని స్థానికులు పేర్కొన్నారు.

ప్రశ్నించినందుకు కేసులు: తమకు జరిగిన అన్యాయంపై ప్రశ్నించినందుకు, మీడియా ముందుకొచ్చి మాట్లాడినందుకు గ్రామంలో కొందరు యువతపై కేసులు నమోదు చేశారు. దీంతో.. అసలు ఆ విషయాలపై మాట్లాడటానికి ఎవరూ ముందుకు రావట్లేదు. తమ సమస్యలు చెబితే ఏమవుతుందోనని భయపడుతున్నారు. పేరు చెప్పేందుకు ఇష్టపడని ఓ యువకుడు మాట్లాడుతూ ‘శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తున్నామని, కొవిడ్‌ నిబంధనలు అతిక్రమించామని గత ఏడాది గోపాలపట్నం పోలీసుస్టేషన్‌లో కేసులు పెట్టారు.

ఇప్పుడు మేమంతా కోర్టు చుట్టూ తిరుగుతున్నాం. ఘటన జరిగిన తర్వాత మృతదేహాలతో ఆందోళన చేసినవారితో పాటు వివిధ సందర్భాల్లో జరిగిన అన్యాయాన్ని ప్రశ్నించినందుకు ఇలా భయపెడుతున్నారు. ఇందులో సుమారు 30 మంది వరకున్నాం. వెంకటాద్రిగార్డెన్స్‌, వెంకటాపురం గ్రామ కమిటీలకు చెందిన 14 మందిపైనా కేసులు పెట్టారు. వాట్సప్‌లో సమస్యలు, పరిహారం అంశాలపై చర్చించడం వల్ల శాంతిభద్రతలకు విఘాతం కలుగుతుందని అప్పట్లో ఆర్డీవో వద్ద కేసులు పెట్టారు. దీంతో ప్రతి నెలా ఆర్డీవో కార్యాలయం చుట్టూ తిరుగుతున్నాం. అక్కడికి ఉదయం పిలిపించి సాయంత్రం వరకు ఉంచేస్తున్నారు’ అని వాపోయారు.

పరిహారం ఏది?: ఘటన సమయంలో వివిధ ఆస్పత్రుల్లో చికిత్సపొందిన పలువురికి ఇప్పటికీ పరిహారం అందలేదు. దీంతో వారు అధికారుల చుట్టూ తిరుగుతున్నారు. పలుమార్లు వినతిపత్రాలు అందించినా ప్రయోజనం లేదు. ఘటన జరిగిన రోజు ప్రాథమిక చికిత్స తీసుకున్న 145 మందికి రూ.25 వేల చొప్పున ఇవ్వాల్సిన పరిహారమూ అందలేదని బాధితులు తెలిపారు.

శరీరం సహకరించట్లేదు: "మునుపటిలా పని చేసుకోలేకపోతున్నాం. ఒక ఫ్లోరు ఎక్కి దిగినా, పది నిమిషాలు నడిచినా ఆయాసం వచ్చేస్తోంది. నాకు చర్మంపై పొలుసులు వచ్చేశాయి. గ్రామంలో చాలామందికి ఛాతీనొప్పి, కీళ్ల నొప్పులు, ఎముకల బలహీనం, మతిమరుపు వంటివి బాధిస్తున్నాయి. చర్మంపై దద్దుర్లు ప్రతి పది మందిలో అయిదుగురికి ఉన్నాయి." - పేరు చెప్పడానికి ఇష్టపడని గ్రామస్థుడు

ఇదీ చదవండి: ప్రభుత్వాసుపత్రుల్లో వైద్య పరీక్షలకు మంగళం.. రోగుల అవస్థలు వర్ణనాతీతం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.