విశాఖ జిల్లా తగరపువలస జాతీయ రహదారి ప్రక్కనున్న అవంతి ఇంజినీరింగ్ కళాశాలలో జాబ్ మేళా నిర్వహించారు. 1,857 మంది నిరుద్యోగులు హాజరయ్యారు. 13 కంపెనీలు వివిధ అర్హతలతో 1000 మందిని ఎంపిక చేసేందుకు ఏపీఎస్ఎస్డీసీ ఆధ్వర్యంలో అవంతి విద్యాసంస్థల వేదికగా ముందుకు వచ్చాయి.
జాబ్ మేళాను రాష్ట్ర మంత్రి, అవంతి విద్యాసంస్థల చైర్మన్ ముత్తంశెట్టి శ్రీనివాసరావు, జాయింట్ కలెక్టర్ గోవిందరావుతో కలిసి ప్రారంభించారు. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు కళాశాల యాజమాన్యం కృషిచేస్తోందని మంత్రి అవంతి అన్నారు. తమ విద్యాసంస్థల విద్యార్థులే కాకుండా ప్రతి ఒక్కరూ ఉపాది, ఉద్యోగ అవకాశాలు కల్పించడమే తమ ధ్యేయమన్నారు.
ఇదీ చదవండి: