ETV Bharat / state

'మోదీ మద్దతు అమరావతికా లేక మూడు రాజధానులకా'

author img

By

Published : Nov 3, 2022, 3:21 PM IST

Jana Jagarana Samithi in ap: ఉత్తరాంధ్ర అభివృద్ధిపై నమ్మకం, చిత్తశుద్ధి ఉంటే ప్రధానితో మూడు రాజధానులకు మద్దతుగా ప్రకటన చేయించే సత్తా వైకాపాకు ఉందా అని జనజాగరణ సమితి సవాల్‌ చేసింది. 3 రాజధానుల పేరుతో కొందరు ప్రజల్ని రెచ్చగొడుతున్నారని జనజాగరణ సమితి నాయకులు విమర్శించారు. తన మద్దతు అమరావతికా.. మూడు రాజధానులకా అనే విషయంపై ప్రధాని స్పష్టత ఇచ్చి.. రాష్ట్ర ప్రజలను విద్వేషపూరిత రాజకీయాల నుంచి రక్షించాలని కోరారు.

జనజాగరణ సమితీ
Jana Jagarana Samithi

Jana Jagarana Samithi State Convener: ఉత్తరాంధ్ర అభివృద్ధిపై నమ్మకం, చిత్తశుద్ధి ఉంటే విశాఖలో త్వరలో జరగనున్న బహిరంగ సభలో ప్రధానితో మూడు రాజధానులకు మద్దతుగా ప్రకటన చేయించగలరా అని జనజాగరణ సమితి రాష్ట్ర కన్వీనర్ సూరె లక్ష్మీ నారాయణ(వాసు) వైకాపా ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. కేంద్రం ప్రవేశపెట్టే ప్రతి బిల్లుకు ప్రారంభం నుంచి మద్దతు తెలుపుతున్న నేపథ్యంలో.. మోదీతో మూడు రాజధానులపై ప్రకటన చేయించాలని సవాలు విసిరారు. మూడు రాజధానుల నిర్ణయంతో ఉత్తరాంధ్ర అభివృద్ధి చెందుతుందని ఊకదంపుడు ఉపన్యాసాలు ఇస్తూ.. కొందరు నేతలు ప్రజల్ని రెచ్చగొడు తున్నారని ఆరోపించారు. విశాఖ భూకుంభకోణంతో పాటుగా.. రుషికొండ విధ్వంసంపై ప్రధాని మోదీ స్పందించాలని కోరారు. భూకబ్జాదారుల నుంచి విశాఖను విముక్తి చేయాలని కోరారు. తన మద్దతు అమరావతికా.. మూడు రాజధానులకా అన్న విషయమై ప్రధాని స్పష్టత ఇచ్చి.. రాష్ట్రప్రజలను విద్వేషపూరిత రాజ కీయాల నుంచి రక్షించాలని కోరారు.

జనజాగరణ సమితీ నాయకులు

భూకుంభకోణాలపై సీబీఐ విచారణ: విశాఖ భూకుంభకోణాలపై సీబీఐ విచారణ జరిగితే విజయసాయిరెడ్డి బాధితులు పెద్దసంఖ్యలో బయటకు వస్తారని తెలిపారు. గత 30 ఏళ్లుగా రాజకీయాలు చేస్తూ పది తరాల ఆస్తులను కూడబెట్టారు గానీ ఏ రోజూ ఉత్తరాంధ్ర అభివృద్ధి గురించి మాట్లాడలేదన్నారు. మంత్రులు పదేపదే 'మా ప్రాంతవాసులు' అంటున్నారని, వారు రాష్ట్రం మొత్తానికి మంత్రులని గుర్తుంచుకోవాలని హితవు పలికారు. నిజంగా రైతులు తలచుకుంటే విజయవాడ, గుంటూరుల్లో వారు తిరగగలరా.. అని ప్రశ్నించారు. ప్రజల డబ్బుతోనే ఓట్లు కొంటున్నారు. వచ్చే ఎన్నికల్లో గెలిచేందుకు ప్రజల డబ్బుతో ఉచితాలు ఇస్తూ ప్రభుత్వం ఓట్లు కొంటోందని 'తెలుగు దండు' వ్యవస్థాపకుడు పరవస్తు ఫణిశయనసూరి పేర్కొన్నారు.

'జగన్ మంచి వ్యాపారి అని.. ఆయనకు ఓట్లేసి ఆంధ్రా హర్షద్ మెహతాలా తయారు చేశామన్నారు. అలా ఓటేసిన దుర్మార్గుల్లో నేనూ ఉన్నా. అధికారంలోకి వస్తే అంతు చూస్తామని తెదేపా నేతలంటున్నారు. పవన్ కల్యాణ్​కు ఓటేద్దామంటే గంటకోమాట, నిమిషానికో చర్య అన్నట్లుగా ఆయన వైఖరి ఉందని తెలిపారు. విశాఖ ఘటన తరువాత ఆయనపై అందరికీ సానుభూతి వచ్చిందని తెలిపారు. అంతలోనే ఆయన సైతం చెప్పు చూపించారని పేర్కొన్నారు. తమను సరిగా పరిపాలించేవారు లేని దుస్థితిలో ఐదుకోట్ల మంది ఆంధ్రులు ఉన్నారని ఆరోపించారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.