అంతర్జాతీయ మత్తు పదార్థాల వ్యతిరేక దినోత్సవం... మత్తు పదార్ధాల వినియోగం వల్ల ఏర్పడే దుష్ఫలితాల గురించి, అక్రమ రవాణాను అరికట్టడం పట్ల ప్రజలకు అవగాహన కల్పించడం ఈ దినోత్సవం ముఖ్య ఉద్దేశ్యం.
కారణం ఏదైనా కావచ్చు.. ప్రేమ విఫలం, బాధ, దుఃఖం, జీవితంలో ఒడిపోయానన్న భావన వచ్చినప్పుడు కొందరు అత్యంత ప్రమాదకరమైన వ్యసనాన్ని అలవాటుగా మార్చుకుంటున్నారు. మత్తు పదార్థాలకు బానిసలవుతున్నారు. వీటికి అలవాటుపడితే అంతతేలిగ్గా బయటకు రావడం కష్టం. మత్తు మనిషి ఆరోగ్యాన్ని పూర్తిగా పీల్చి పిప్పి చేసి మరణం వరకూ తీసుకెళ్తుంది.
- మత్తుకు బానిసలైన వారిలో వ్యాధి నిరోధక శక్తి తగ్గిపోతుంది.
- గుండె కొట్టుకోవడంలో వ్యత్యాసం , గుండెపోటు వస్తుంది.
- మత్తు పదార్థాలను ఇంజక్షన్లుగా తీసుకునే వారికి రక్తనాళాలు చెడిపోతాయి. దీని వల్ల అవయవాలకు ఎక్కువ నష్టం కలుగు తుంది.
- తరుచూ కడుపు నొప్పి, వాంతులు, వికారం లక్షణాలు కనిపిస్తాయి.
- కాలేయంపై ప్రభావం పడుతుంది.
- రోగులు శారీరక పటుత్వాన్ని, జ్ఞాపక శక్తిని కోల్పోతుంది.
- శరీర ఉష్ణోగ్రతలో తేడాలు వస్తాయి.
- పురుషుల ఛాతీ భాగం పెరుగుదలతోపాటు ఆరోగ్యంలో విపరీత మార్పులు సంభవిస్తాయి.
- ఊపిరితిత్తులు, మూత్రపిండాలు, జీర్ణాశయం, మెదడుపై వాటి తీవ్రత ఎక్కువగా ఉంటుంది.
మత్తులోకి ఒక్కసారి అడుగుపెట్టిన వారు బయిట పడటం ఒక సాహసమే… నిజంగా బయటపడితే అది అద్భుతమే. మత్తు పదార్ధాలకు బానిసైన యువత జీవితాలు అంధకారంలోకి వెళుతున్నాయి. ఇలాంటి వారిని అదుకుంటోంది విశాఖలోని గ్రీన్ వాలీ. వ్యసనపరుల జీవితంలో వెలుగు నింపేందుకు ఈ సంస్థ దశాబ్దం కాలంగా పనిచేస్తోంది. విశాఖ నగర శివారు మధురవాడ మిదిలపురి వుడాకాలనిలో గ్రీన్ వ్యాలీ పౌండేషన్ ఉంది. అనేక రకాల మత్తు అలవాట్లు ఉన్న వారికి అవగాహన కల్పించి.. వారిని మళ్లీ మామూలు స్థితికి తీసుకువచ్చేందుకు ఈ సంస్థ కృషి చేస్తుంది. అనేక మంది వ్యసనపరులను సాధారణ స్థితికి తీసుకొచ్చి వారి జీవితాల్లో మళ్లీ వెలుగు నింపుతోంది.
ఇదీ చదవండి: చైనాకు సవాల్: భారత్కు అమెరికా బలగాలు!