విశాఖ జిల్లా గోపాలపట్నం శివారు గ్రామమైన కొత్తపాలెంవాసి ఎల్లపు అప్పలరాజు (30).. ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. దువ్వాడ రైల్వే స్టేషన్లో పట్టాలపై ఉన్న హై ఓల్టేజీ విద్యుత్ స్తంభం ఎక్కాడు. హై టెన్షన్ వైర్లు పట్టుకుని చనిపోతానంటూ హల్ చల్ చేశాడు. అతని గురించి సమాచారం అందుకున్న గోపాలపట్నం సీఐ మళ్ల అప్పారావు.. దువ్వాడ రైల్వే పోలీసులు.. వెంటనే విద్యుత్ సరఫరా నిలిపివేశారు. కిందకు దింపారు. రైల్వే పోలీసులు కేసు నమోదు చేశారు.
అసలు విషయం ఏంటంటే...
అప్పలరాజు.. తన ఆత్మహత్యాయత్నానికి గల కారణాన్ని చెప్పగా.. అది విని పోలీసులు విస్తుపోయారు. తన భార్యతో తనకు తరచూ గొడవలు జరిగేవని.. తనపై అలిగి పుట్టింటికి వెళ్లిపోయిందని చెప్పాడు. ఇంటికి తిరిగి రావాలంటూ ఎన్నిసార్లు కోరినా.. ఆమె తిరిగి రాలేదని చెప్పాడు. చివరికి.. సహనం కోల్పోయిన అప్పలరాజు.. ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డట్టు చెప్పాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. ఈ వివరాలు వెల్లడించారు.
ఇదీ చూడండి:
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని వాడొద్దని ఈసీ చెప్పింది: రఘురామకృష్ణరాజు