ETV Bharat / state

అరకు లోయలో హిందూ ధర్మ ప్రచార యాత్ర

author img

By

Published : Mar 25, 2021, 3:48 PM IST

విశాఖ జిల్లా అరకు లోయలో శారద పీఠం ఉత్తరాధిపతి స్వాత్మానందేంద్ర స్వామి పర్యటించారు. గ్రామాల్లోని గిరిజనులకు హిందూ మతంపై అవగాహన కల్పించేందుకు వీలుగా హిందూ ధర్మ ప్రచార యాత్ర నిర్వహిస్తున్నామని చెప్పారు.

అరకు లోయలో హిందూ ధర్మ ప్రచార యాత్ర
అరకు లోయలో హిందూ ధర్మ ప్రచార యాత్ర

విశాఖ జిల్లా అరకు లోయలో శారదా పీఠం ఉత్తరాధిపతి స్వాత్మానందేంద్ర స్వామి పర్యటించారు. ఎండపల్లి వలస బాలికల ఆశ్రమ పాఠశాలలో గురుదేవ ఛారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మంచి నీటి బోరును ఆయన ప్రారంభించారు. విద్యార్థులకు విలువలతో కూడిన విద్యను అందించాలని ఉపాధ్యాయులను స్వామిజీ కోరారు. ఈ సందర్భంగా ఆధ్యాత్మిక కార్యక్రమాలతో పాటు పలు సేవా కార్యక్రమాల్లో పాల్గొన్న స్వామీజీ గిరిజనులను ఉద్దేశించి మాట్లాడారు. అరకువ్యాలీలోని వేంకటేశ్వర స్వామి ఆలయాన్ని సందర్శించారు.

శ్రీకృష్ణ మందిరానికి వెళ్లి ప్రత్యేక పూజలు నిర్వహించారు. గిరిజన ప్రాంతంలో...శారద పీఠం ఆధ్వర్యంలో పలు సేవా కార్యక్రమాలు చేపట్టడం ఆనందంగా ఉందని అన్నారు. ఆదే విధంగా అరకు లోయ ఎన్టీఆర్ మైదానంలో ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు. గ్రామాల్లోని గిరిజనులకు హిందూ మతంపై అవగాహన కల్పించేందుకు వీలుగా హిందూ ధర్మ ప్రచార యాత్ర నిర్వహిస్తున్నామన్నారు. ఈకార్యక్రమంలో భాగంగా స్వామిజీని దర్శించుకునేందుకు పరిసర ప్రాంతాలన నుంచి గిరిజనులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.

ఇదీ చదవండి:

బీహార్​కు తరలిస్తుండగా... 18 కిలోల గంజాయి పట్టివేత

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.