నేతన్న నేస్తం పథకంలో అర్హులైన చేనేత కార్మికులకు న్యాయం చేయాలని కోరుతూ... పాయకరావుపేట తహసీల్దార్ కార్యాలయం వద్ద ధర్నాకు దిగారు. ప్రభుత్వం ప్రవేశపెట్టిన నేతన్న నేస్తం పథకంలో నిజమైన లబ్దిదారులకు జాబితాలో చోటులేదని ఆవేదన వ్యక్తం చేశారు. మగ్గం లేని వారిని జాబితాలో అర్హులుగా చేర్చారని ఆరోపించారు. పట్టణంలో సుమారు 350 మంది చేనేత కార్మికులు ఉండగా కేవలం 50 మంది పేర్లు మాత్రమే జాబితాలో ఉన్నాయని పేర్కొన్నారు. గ్రామ వాలంటీర్లు నిర్లక్ష్యంగా వ్యవహరించారని... వీరిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
ఇదీ చదవండి :