ETV Bharat / state

'తెదేపా, సీపీఐ అభ్యర్థులను సీఐ బెదిరించారు' - వినుకొండ వార్తలు

పురపాలక ఎన్నికల్లో తెదేపా, సీపీఐ అభ్యర్థులను బెదిరించిన వినుకొండ పట్టణ సీఐ చిన్నమల్లయ్యపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తామని మాజీ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు అన్నారు. కౌన్సిల్​లో ప్రతిపక్షం ఉండకూడదనే ఎమ్మెల్యేకు తొత్తుగా వ్యవహరించి సీఐ దౌర్జన్యాలకు పాల్పడ్డారని జీవీ ఆరోపించారు.

Vinukonda distpute
వినుకొండ వివాదం
author img

By

Published : Mar 12, 2021, 10:24 AM IST

వినుకొండ పట్టణ సీఐ చిన్న మల్లయ్య ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు తొత్తుగా వ్యవహరించి మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేస్తున్న తెదేపా, సీపీఐ అభ్యర్థులను బెదిరించి దౌర్జన్యాలకు పాల్పడ్డాడని మాజీ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు ఆరోపించారు. ఎమ్మెల్యే బొల్లా అండదండలతో సీఐ చిన్న మల్లయ్య ఏకపక్షంగా వ్యవహరించారని... 9వ తేదీ రాత్రి తెదేపా, సీపీఐ అభ్యర్థుల వార్డులకు వెళ్లి, పిలిపించి తప్పుడు కేసులు బనాయించి రౌడీషీట్లు ఓపెన్ చేస్తానని బెదిరించడం దుర్మార్గమన్నారు. సీఐ చిన్న మల్లయ్య పట్టణంలోని అన్ని వార్డులు వైకాపాకి గెలిపించి ఇస్తానని ఎమ్మెల్యేతో ఒప్పందం కుదుర్చుకొని దౌర్జన్యాలకు పాల్పడ్డారని ఆరోపించారు. 10వ తేదీన జరిగిన మున్సిపల్ ఎన్నికల బూత్​ల వద్ద సీఐ చిన్న మల్లయ్య అత్యుత్సాహాన్ని ప్రదర్శించి అభ్యర్థులను ఓటర్లను భయబ్రాంతులకు గురి చేశారని జీవీ ఆరోపించారు. 27వ వార్డు వద్ద అభ్యర్థి భర్త భూదాల చిన్నపై సీఐ దౌర్జన్యం చేయటం అమానుషమన్నారు. చిన్న మల్లయ్య కులం పేరుతో దూషించి గొడవలు సృష్టించి ప్రోత్సహిస్తూ చట్ట వ్యతిరేక చర్యలకు పాల్పడ్డారు అన్నారు. కౌన్సిల్​లో ప్రతిపక్షం ఉండరాదని దౌర్భాగ్యం ఎమ్మెల్యే ఆలోచనకు సీఐ చిన్న మల్లయ్య ఊతమిస్తూ తప్పుడు కేసులు పెడతానని, ఎన్​కౌంటర్ చేస్తానని బెదిరిస్తున్నారని ఆరోపించారు.

సీఐపై ఫిర్యాదు చేస్తాం

బుధవారం జరిగిన వినుకొండ పురపాలక సంఘం ఎన్నికల్లో పట్టణ సీఐ చిన్న మల్లయ్య చేసిన దౌర్జన్యాలపై పోలీస్ ఉన్నతాధికారులతో పాటు రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్​కు ఫిర్యాదు చేస్తామని సీపీఐ ఏరియా కార్యదర్శి మారుతి వరప్రసాద్ తెలిపారు. పట్టణ సీఐ చేస్తున్న దౌర్జన్యాలను ప్రజలు గమనిస్తున్నారని అఖిలపక్ష పార్టీలతో ప్రజా సంఘాలను కలుపుకొని సీఐ చిన్న మల్లయ్యపై చర్యలు తీసుకునేంతవరకు ఉద్యమం చేస్తామని మారుతి వరప్రసాద్ తెలిపారు.

జాతీయ ఎస్సీ ఎస్టీ కమిషన్​కు దృష్టికి తీసుకెళ్తాం

వినుకొండ పట్టణంలో సీఐ చిన్న మల్లయ్య దళితులపై చేస్తున్న హింసలను జాతీయ ఎస్సీ ఎస్టీ కమిషన్ దృష్టికి తీసుకెళ్తామని రాష్ట్ర మాలమహానాడు ఐక్యవేదిక వర్కింగ్ ప్రెసిడెంట్ పైనం జాన్ బాబు తెలిపారు. బుధవారం వినుకొండ పట్టణంలో జరిగిన పురపాలక సంఘ ఎన్నికలకు సంబంధించి 27 వ వార్డు వద్ద చిన్న మల్లయ్య దళితులపై చేసిన దౌర్జన్యాలను తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. బీఎస్పీ నాయకులు నెరెళ్ళ రాజుపై ఎన్​కౌంటర్ చేస్తానని కులం పేరుతో దూషిస్తే దుర్భాషలాడిన సీఐ చిన్నమలయ్యపై ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

ఇదీ చదవండి:

అరండల్​పేటలో వాచ్​మెన్​పై నలుగురు వ్యక్తులు దాడి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.