విశాఖ జిల్లా గోవాడ సహకార చక్కెర కర్మాగారం కార్మికులు ధర్నాకు దిగారు. బకాయి పడిన మూడు నెలల వేతనం, అలవెన్సులు చెల్లించాలని డిమాండ్ చేశారు. తమ వేతనాలు చెల్లించిన అనంతరమే.. విధులకు హాజరవుతామని స్పష్టం చేశారు.
కర్మాగార యాజమాన్య సంచాలకులు వి.సన్యాసినాయుడు, పరిపాలనాధికారి పప్పల వెంకటరమణమూర్తి కార్మికులతో మాట్లాడి శాంతింపజేశారు. జూలై నెలలో జీతాలు చెల్లించేందుకు ఏర్పాటు చేస్తామని హామీ ఇవ్వటంతో.. కార్మికులు ధర్నా విరమించి విధులకు హాజరయ్యారు.
ఇదీ చదవండి: