విశాఖను ఎగ్జిక్యూటివ్ రాజధానిగా చేస్తే సంతోషమేనని గంటా శ్రీనివాసరావు అన్నారు. రాజధాని అంశాలపై విశాఖ తెదేపా నేతలు చర్చించారు. అమరావతిలో రైతులకు న్యాయం చేసి తీరాలని గంటా అన్నారు. రాజధాని విశాఖకు నిజంగా వస్తుందో.. లేక రాజకీయ లబ్ధి కోసం ప్రచారం చేస్తున్నారో చూద్దామన్నారు. రాజధాని పేరుతో ప్రశాంత నగరంలో అరాచక శక్తులు ప్రవేశించే ప్రమాదం ఉందని గంటా అభిప్రాయపడ్డారు.
ఇదీ చదవండి: 'గంటా శ్రీనివాసరావు అధికారం లేకపోతే బతకలేరు'