ETV Bharat / state

ఈ అక్కాచెల్లెళ్లు చదువులో మేటి.. వీరికి కళల్లో లేరు సాటి! - విశాఖ జిల్లా వార్తలు

విశాఖకు చెందిన ఈ అక్కాచెల్లెళ్లు.. బహుముఖ ప్రజ్ఞకు చిరునామాగా నిలుస్తున్నారు. సంప్రదాయ శాస్త్రీయ నృత్యం - సంగీతంతో పాటు.. ఆధునిక నృత్యంలో మెళకువలు సాధించి ప్రతిభ చూపుతున్నారు. చదువులోనూ ఉత్తమ ప్రదర్శన చేస్తూ.. తోటి వారికి ఆదర్శంగా నిలుస్తున్నారు. వారే.. నిమిలిక, మధులిక.

Excelling in traditional and modern arts .. competing in education
సంప్రదాయ, ఆధునిక కళల్లో రాణిస్తూ.. చదువులోనూ పోటాపోటీ..
author img

By

Published : Jan 31, 2021, 12:55 PM IST

Updated : Feb 2, 2021, 10:18 AM IST

సంప్రదాయ, ఆధునిక కళల్లో రాణిస్తూ.. చదువులోనూ పోటాపోటీ..

విశాఖకు చెందిన అక్కాచెల్లెళ్లు నిమిలిక, మధులిక... చిన్నప్పటి నుంచి శాస్త్రీయ నృత్యం, గాత్రం నేర్చుకుంటూ ఉన్నత విద్యకు బాటలు వేసుకున్నారు. కళ ద్వారా ఒత్తిడిని అధిగమిస్తూ ముందుకు సాగుతున్నారు. తిరుమల స్వామివారి కోసం జరిగే నాదనీరాజనంలో ఈ అక్కచెల్లెళ్లకు తమ కళా ప్రదర్శనలిచ్చే అవకాశం పలుమార్లు లభించింది. ఇష్టమైన కళలో రాణిస్తూ, దానిలో అంతర్లీనంగా ఉండే గణిత శాస్త్రంపైనా పట్టు సాధించారు. చదువులోనూ ప్రతిభ చూపిస్తూ.. శభాష్ అనిపించుకుంటున్నారు.

తల్లిదండ్రుల ప్రోత్సాహంతో..

కుమార్తెల్లో చిన్నప్పటి నుంచీ కళపై ఉన్న ఆసక్తిని గుర్తించిన తల్లిదండ్రులు వెంపరాల శ్రీదేవి, శ్రీనివాస్‌ వివిధ గురువుల వద్ద ప్రత్యేక శిక్షణ ఇప్పించారు. ఫలితంగా.. పెద్దమ్మాయి నిమిలిక పాఠశాల స్థాయి నుంచే పలు ప్రదర్శనలు ఇస్తూ వచ్చింది. గిన్నిస్‌ బుక్‌ అఫ్‌ రికార్డ్స్‌లో నమోదైన మహా బృంద నృత్యం సహా పలు వేదికలపై ఆమె ప్రదర్శనలు ప్రశంసలు అందుకున్నాయి. ఎంటెక్‌ పూర్తి చేసి ఉద్యోగంలో చేరే వరకు ఈ పరంపర కొనసాగింది.

నృత్యం నుంచి గాత్రానికి..

అక్కతోపాటే తొలుత నృత్యంపైనే మధులిక అభిరుచి కనబరిచేది. ఆమె కంఠం గాత్రానికి బాగా అమరడం వల్ల గురువుల సూచనతో పాటల సాధన చేయడం మొదలెట్టి క్రమంగా బహుమతుల పంట పండిస్తోంది. ఇటీవలే రాష్ట్ర స్థాయిలో ప్రథమ స్థానాన్ని కూడా సొంతం చేసుకుంది.

ఆధునిక జుంబాలో కూడా...

అక్కచెల్లెళ్ల అభిరుచి కేవలం సంప్రదాయ కళలకే పరిమితం కాకుండా ఆధునిక జుంబా నృత్య సాధనలోనూ గుర్తింపు తెచ్చింది. ఇందులో ఇద్దరి సాధన ఇప్పుడు ఇనస్ట్రక్టర్‌గా అర్హత సాధనకు తోడ్పడుతోంది. చదువులోనూ అగ్రస్థానంలో ఉండేటట్టుగా చూసుకుంటూ కళలో రాణిస్తున్నారు.

దీక్షగా సాధన చేస్తే ఎంతో ఫలితం

ప్రధానంగా కళ ఎలా జీవితానికి, ఇతర సైన్స్‌కి అన్వయిస్తుందో నా ఎంటెక్‌ శాస్త్రీయ పత్రంలో వివరించా. చిన్నప్పటి నుంచే శాస్త్రీయ నృత్యంపై మక్కువతో సాధన చేస్తూ, ప్రదర్శనలు ఇస్తూ వచ్చా. ట్రిపుల్‌ ఐటి కాంచీపురంలో బీటెక్ ‌/ ఎంటెక్‌ చేస్తున్న సమయంలోనూ నా కళను విడిచిపెట్టకుండా సాధన చేస్తూనే ఉన్నా. గణితం ఇందులో ఎంతో ఉంది. ఒత్తిడిని జయించేందుకు కళ ఒక సాధనంగా ఉపకరిస్తుందన్నది నాకు అనుభవైకవేద్యం. అందుకే నేను నృత్యంలో కూడా మంచి మెరిట్‌లో డిప్లొమాలు పూర్తి చేయగలిగా. పరిశోధకురాలిగా, కళాకారిణిగా ఒక సంపూర్ణ హ్యూమన్‌గా ఉండాలన్నదే లక్ష్యం.

- నిమిలిక, సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్, కళాకారిణి

అన్నింటిలోనూ గణితం ఉంది

ఏడేళ్ల నుంచి సంగీతం పట్ల అభిరుచి పెరిగింది. ముందు అక్కతో పాటే నృత్య తరగతులకు వెళ్లినా, బాలకొండల రావు (బాలక్క) గారు నా స్వరం బాగుందని గాత్రం వైపుగా వెళ్లాలని సూచించారు. మానాపురపు సత్యనారాయణగారి వద్ద నేర్చుకోవడం మొదలు పెట్టా. ఇప్పుడు రుద్రావర్ఝుల కుసుమ కుమారిగారి శిష్యరికంలో సాధన చేస్తూన్నా. భావయుక్తంగా పాడితే అందులో తాదాత్య్మత శ్రోతలకు కూడా అందుతుంది. సంగీతంలో గతి, తాళం, స్వర కల్పన అన్నింటిలోనూ గణితం పూర్తిగా నిండి ఉంది. పాటలో ఉన్న గణితాన్ని పట్టుకుంటున్నా. ప్రస్తుతం ఇంటర్‌ చదువుతున్నా. ర్యాంకుల సాధనలోనూ ఎక్కడా వెనుకబడలేదు. కళ సాధన ఎంతో ఉత్తేజాన్ని, నూతనత్వాన్ని ఇస్తోంది. దానివల్లనే నా లక్ష్యమైన శాస్త్రవేత్తగా ఎదగాలన్నది సాధించగలనన్న నమ్మకం బలంగా ఉంది.

- మధులిక, ఇంటర్మీడియట్ విద్యార్థిని

ప్రాధాన్యంతో ఒత్తిడి దూరం

తనకు చిన్నప్పటి నుంచి శాస్త్రీయ నృత్యంలో ఉన్న ప్రవేశం పిల్లలకు కూడా అభిరుచిగా మారడం వల్ల వారికి తగినట్టుగా తమవంతుగా శక్తి వంచన లేకుండా గురువుల వద్ద శిక్షణను ఇప్పించామని తల్లి శ్రీదేవి చెబుతున్నారు. ఏ కళలోనైనా అభిరుచిగా అభ్యసించి ప్రతిభ కనబరుస్తున్న వారికి ఉన్నత విద్య, ఉద్యోగం వంటి వాటిల్లో కొంత ప్రాధాన్యం ఇస్తే నేటితరంపై ఉన్న ఒత్తిడిని అధిగమించగలుగుతారని తండ్రి శ్రీనివాస్‌ చెప్పారు.

ఇదీ చదవండి:

రిజర్వేషన్ల తంటా.. ఓట్లకు దూరం

Last Updated : Feb 2, 2021, 10:18 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.