విశాఖలో 20 కరోనా పాజిటివ్ కేసులు రావడం వల్ల... నగరంలోని సున్నిత ప్రాంతాల్లో లాక్‌డౌన్‌ను మరింత పటిష్ఠంగా అమలుచేస్తున్నారు. పోలీసులు ఆయా కాలనీల్లో ఆంక్షలను కట్టుదిట్టం చేశారు. బయటివారు ఆ ప్రాంతాల్లోకి రాకుండా అష్ట దిగ్బంధం చేశారు. అక్కయ్యపాలెంలో పరిస్థితిని డీసీపీ రంగారెడ్డి, ఎస్పీ రవికుమార్ పర్యవేక్షిస్తున్నారు. ప్రధాన రహదారికి అనుసంధానమైన దారులు బారికేడ్లతో మూసివేశారు. నగరంలో 60 ర్యాపిడ్ రెస్పాన్స్ ఆరోగ్య బృందాలను ఏర్పాటు చేశారు. ప్రజలు ఎలాంటి ఆందోళనలకు గురికావద్దని అధికారులు సూచించారు. ఇళ్ల నుంచి బయటకు రాకుండా ఉండటమే తమకు అందించే సహకారమని చెబుతున్నారు.
ఇదీ చదవండి: ఈ పరికరం కరోనా రోగులకు ప్రాణవాయువు అందిస్తుంది..!