విశాఖ జిల్లాలోని మూడు రహదారులను రూ. 68 కోట్లతో అభివృద్ధి చేసేందుకు ఇంజనీరింగ్ అధికారులు ప్రణాళికను రూపొందించారు. 50 కి.మీ మేర ఉన్న రహదారులను అభివృద్ధి చేయటంతో పాటు వీటిని విస్తరించనున్నారు. రహదారుల, భవనాల శాఖ ప్రధాన కార్యదర్శి ఎం.టి కృష్ణ బాబు పేరిట నిధులు మంజూరు చేస్తూ అదేశాలు వెలువడ్డాయి. కశింకోట నుంచి చోడవరం నియోజకవర్గం పరిధిలో ఉన్న బంగారుమెట్ట వరకు ఉన్న 24 కి.మీ మేర రహదారిని అభివృద్ధికి రూ.32కోట్లు మంజూరయ్యాయి. చోడవరం నియోజకవర్గం గవరవరం నుంచి మాడుగుల నియోజకవర్గంలోని కాశీపురం వరకు 15 కి.మీ. రహదారిని విస్తరించనున్నారు. ఇందుకు రూ.20కోట్లు కేటాయించారు. విశాఖలోని ఎన్హెచ్ 3 నుంచి రేవడి వయా విశాఖ మీదుగా కోరాడ, మజ్జిపేట వరకు ఉన్న 11కి.మీలను రూ.16కోట్లతో అభివృద్ధి చేయనున్నారు.
విశాఖలో రూ.68 కోట్లతో మూడు రహదారుల అభివృద్ధి
విశాఖ జిల్లాలోని మూడు రహదారులను అభివృద్ధి చేసేందుకు రూ.68కోట్లతో ఇంజనీరింగ్ అధికారులు ప్రణాళికను రూపొందించారు. రహదారుల, భవనాల శాఖ ప్రధాన కార్యదర్శి ఎం.టి కృష్ణ బాబు పేరిట నిధులు మంజూరు చేస్తూ అదేశాలు వెలువడ్డాయి.
విశాఖ జిల్లాలోని మూడు రహదారులను రూ. 68 కోట్లతో అభివృద్ధి చేసేందుకు ఇంజనీరింగ్ అధికారులు ప్రణాళికను రూపొందించారు. 50 కి.మీ మేర ఉన్న రహదారులను అభివృద్ధి చేయటంతో పాటు వీటిని విస్తరించనున్నారు. రహదారుల, భవనాల శాఖ ప్రధాన కార్యదర్శి ఎం.టి కృష్ణ బాబు పేరిట నిధులు మంజూరు చేస్తూ అదేశాలు వెలువడ్డాయి. కశింకోట నుంచి చోడవరం నియోజకవర్గం పరిధిలో ఉన్న బంగారుమెట్ట వరకు ఉన్న 24 కి.మీ మేర రహదారిని అభివృద్ధికి రూ.32కోట్లు మంజూరయ్యాయి. చోడవరం నియోజకవర్గం గవరవరం నుంచి మాడుగుల నియోజకవర్గంలోని కాశీపురం వరకు 15 కి.మీ. రహదారిని విస్తరించనున్నారు. ఇందుకు రూ.20కోట్లు కేటాయించారు. విశాఖలోని ఎన్హెచ్ 3 నుంచి రేవడి వయా విశాఖ మీదుగా కోరాడ, మజ్జిపేట వరకు ఉన్న 11కి.మీలను రూ.16కోట్లతో అభివృద్ధి చేయనున్నారు.
ఇదీ చదవండి:
పోలీస్స్టేషన్లో మహిళపై ఎస్సై దాడి