జిల్లాలోని డప్పు కళాకారులకు గుర్తింపు కార్డులు మంజూరు చేయాలని కోరుతూ విశాఖ జిల్లా మాకవరపాలెం మండల తహసీల్దార్ కార్యాలయం వద్ద ధర్నా చేశారు. కేవీపీఎస్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. దరఖాస్తు చేసి నెలలు గడుస్తున్నా... ఇప్పటికీ కార్డులు మంజూరు చేయకపోవడం విచారకరమని కేవీపీఎస్ జిల్లా అధ్యక్షులు చిరంజీవి ఆరోపించారు. అర్హులైన కళాకారులందరికీ ఎస్సీ కార్పొరేషన్ రుణాలకు ఎంపిక చేయాలని డిమాండ్ చేశారు. అనంతరం తహసీల్దార్ రాణి అమ్మాజీకి వినతిపత్రం సమర్పించారు.
ఇదీ చదవండి :