శాసనసభలో ఆమోదించిన బిల్లును శాసన మండలిలో ఆమోదించక పోయినప్పటికీ అవి నిబంధనల మేరకు చట్టాలుగా మారుతాయన్నారు మాజీ మంత్రి, వైకాపా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దాడి వీరభద్రరావు. విశాఖలో మాట్లాడిన ఆయన.. ద్రవ్య వినియోగ బిల్లును ఆమోదించ పోవడం దురదృష్టకరమన్నారు. లోకేశ్ తీరును మందలించకుండా చంద్రబాబునాయుడు తెదేపాను రాసిస్తే భవిష్యత్లో ప్రతిపక్ష హోదా కోల్పోతుందన్నారు. చంద్రబాబునాయుడు దర్శకత్వంలో లోకేశ్ నేతృత్వంలో కౌన్సిల్లో తెదేపా సభ్యులు దాడులు చేసి.. సభా గౌరవాన్ని మంటగలిపారని మండిపడ్డారు.
ఇవీ చూడండి...