ETV Bharat / state

కరోనా వైరస్... విమానాశ్రయం వద్ద అప్రమత్తత..!

కరోనా వైరస్‌పై విశాఖ విమానాశ్రయం, కేజీహెచ్‌, వైద్యఆరోగ్యశాఖ అధికారులు అప్రమత్తమయ్యారు. కేజీహెచ్‌లో మూడు పడకలతో ప్రత్యేక వార్డును సిద్ధం చేశారు. విమానాశ్రయంలో అంతర్జాతీయ ప్రయాణికులకు ప్రభుత్వ వైద్యుల పర్యవేక్షణలో ఆరోగ్య పరీక్షలు చేస్తున్నారు. ప్రత్యేకించి దుబాయ్‌, కౌలాలంపూర్‌, సింగపూర్‌ నుంచి వస్తున్న ప్రయాణికులను పూర్తిస్థాయిలో పరీక్షించాకే నగరంలోకి అనుమతిస్తున్నామని విమానాశ్రయ డైరెక్టర్‌ రాజకిషోర్‌ తెలిపారు. వైరస్‌ ప్రభావం తగ్గేదాకా ఈ చర్యలుంటాయన్నారు.

కరోనా వైరస్...జాగ్రత్త సుమా !
కరోనా వైరస్...జాగ్రత్త సుమా !
author img

By

Published : Jan 28, 2020, 2:49 PM IST

Updated : Jan 28, 2020, 3:05 PM IST

కరోనా వైరస్​పై అప్రమత్తంగా ఉంటామన్న విమానాశ్రయ అధికారులు

కరోనా వైరస్​ భయంతో అన్ని విమానాశ్రయాలను ఎయిర్‌పోర్టు అథారిటీ ఆఫ్‌ ఇండియా అప్రమత్తం చేసిన నేపథ్యంలో విశాఖ విమానాశ్రయంలోని అరైవల్స్‌ విభాగంలో ప్రత్యేక శిబిరాన్ని అధికారులు తెరిచారు. ప్రయాణికుల్లో ఎవరికైనా జలుబు, దగ్గు, చలిజ్వరం లాంటి లక్షణాలు ఉన్నాయా అనేది వైద్యపరీక్షల ద్వారా తెలుసుకుంటున్నారు. ఇప్పటివరకైతే ఎవరిలోనూ కరోనా వైరస్‌ లక్షణాలు బయటపడలేదని విమానాశ్రయ డైరెక్టర్​ రాజకిశోర్​చెప్పారు.

ప్రయాణికుల ఆరోగ్య పరిస్థితిపై ఆరా..

ప్రతీ ప్రయాణికుని నుంచి ‘మీరు ఏ ప్రాంతం నుంచి వస్తున్నారు, గత నెల రోజుల్లో ఏయే ప్రాంతాల్లో తిరిగారు’ వంటి వివరాలను అధికారులు సేకరిస్తున్నారు. ప్రత్యేకించి చైనాలోని హువాంగ్‌ ప్రాంతాలకు వెళ్లినవారెవరైనా ఉన్నారా అని ఆరా తీస్తున్నారు. కరోనా వైరస్‌పై ప్రయాణికులకు అవగాహన కల్పించడం కోసం అరైవల్‌, డిపార్చర్‌ విభాగాల్లో ప్రకటనల్ని ప్రదర్శిస్తున్నారు. ప్రతీ ప్రయాణికుడి నుంచి అభిప్రాయాల్ని సైతం సేకరిస్తున్నారు. ఒకవేళ ఎవరిలోనైనా కరోనా వైరస్‌ లక్షణాలున్నట్లు, ఇతర అనారోగ్య పరిస్థితులు కనిపిస్తే.. వెంటనే కేజీహెచ్‌ తరలించేందుకు అంబులెన్స్‌ను అందుబాటులో ఉంచారు. ప్రతీరోజూ నిర్వహించిన పరీక్షల వివరాల్ని, ప్రయాణికుల అభిప్రాయాల్ని కేంద్ర ఆరోగ్యశాఖకు నివేదిస్తున్నట్లు విమానాశ్రయ డైరెక్టర్‌ తెలిపారు.

అవగాహన కల్పించేందుకు గోడపత్రికలు

రాష్ట్ర వైద్య విద్యా శాఖ సంచాలకులు, ఆరోగ్యశాఖ సంచాలకుల ఆదేశాల మేరకు కరోనా వైరస్‌ తీవ్రత, వ్యాధి లక్షణాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ప్రజల్లో అవగాహన కలిగించేందుకు విమానాశ్రయ యాజమాన్యం గోడపత్రికలను సిద్ధం చేసింది. ఇప్పటికే కేజీహెచ్‌ వైరాలజీ ల్యాబ్‌లో స్వైన్‌ఫ్లూ, డెంగీ, వేరిసల్లా, పొంగువ్యాధి వ్యాధి నిర్ధరణ పరీక్షలు చేస్తున్నారు. కరోనా వైరస్‌ నిర్ధరణకు అవసరమైన పరీక్షలు చేసే సత్తా ఇక్కడి వైద్యాధికారులకు ఉన్నా.. దానికి సంబంధించిన ప్రత్యేక చిప్స్‌ అందుబాటులో లేవు. ఇవి ఉంటే కరోనా నిర్ధరణ పరీక్షలను చేస్తామని వారు చెబుతున్నారు. కేజీహెచ్‌లో మెడిసిన్‌ విభాగ ప్రొఫెసరు, కేజీహెచ్‌ ఉప పర్యవేక్షక వైద్యాధికారి డాక్టర్‌ కె.ఇందిరాదేవిని నోడల్‌ అధికారిగా నియమిస్తూ వైద్య విద్యాశాఖ సంచాలకులు (డీఎంఈ) డాక్టర్‌ వెంకటేష్‌ ఉత్తర్వులిచ్చారు. కేజీహెచ్‌లో ప్రత్యేకంగా మూడు పడకలతో వార్డు ఏర్పాటు చేశారు. అనుమానిత లక్షణాలు ఉన్న వారికి తొలుత అందుబాటులో ఉన్న స్వైన్‌ఫ్లూ, డెంగీ వంటి పరీక్షలు చేస్తారు. ఇవేవీ కాదని తేలితే కరోనా వైరస్‌ నిర్ధరణ కోసం నమూనాలను పుణెలోని జాతీయ వైరాలజీ ల్యాబ్‌కు పంపుతారు.

కరోనా వైరస్‌ లక్షణాలివీ....

  • జలుబు, దగ్గు, జ్వరం, శ్వాస పీల్చుకోవడంలో ఇబ్బంది
  • ఛాతిలో నొప్పి, ఆయాసం వంటి లక్షణాలు కనిపిస్తాయి. వీటి తీవ్రత అధికంగా ఉంటుంది.
  • నీరుడు స్తంభించి, మూత్రపిండాల వైఫల్యాలకు దారి తీస్తుంది.

తీసుకోవాల్సిన జాగ్రత్తలు

  • దగ్గినా, తుమ్మినా చేతి రుమాలు ముక్కుకు లేదా నోటికి అడ్డంగా పెట్టుకోవాలి. లేకుంటే మాస్కును వినియోగించాలి.
  • తరచూ చేతులను శుభ్రంగా కడుక్కోవాలి. జన సమూహం అధికంగా ఉన్న ప్రాంతాలకు వెళ్లరాదు.
  • గర్భిణీలు, బాలింతలు, పిల్లలు, వృద్ధులు అప్రమత్తంగా ఉండాలి. చలి ప్రదేశాల్లో తిరగకూడదు. వ్యక్తిగత శుభ్రత పాటించాలి. పెంపుడు జంతువులకు దూరంగా ఉండాలి.

రావడానికి కారకాలు

  • కప్పలు, పాములు, చేపల వంటి ద్వారా కరోనా వైరస్‌ సంక్రమించే అవకాశం ఉంది.

ఇదీ చదవండి:

శాంతించని కరోనా.. చైనాలో 106కు చేరిన మృతులు

sample description
Last Updated : Jan 28, 2020, 3:05 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.