ETV Bharat / state

ఆలయ భూముల్లో... అక్రమాల పర్వం

author img

By

Published : Jan 30, 2021, 6:25 PM IST

ఆలయ భూముల్లో అక్రమాలు జరుగుతున్నాయన్న సమాచారంతో ప్రభుత్వం దేవాలయాల భూములపై ప్రత్యేక అధికారిణి నియమించి మరీ నివేదిక తెప్పించుకుంది. అయినప్పటికీ పరిస్థితిలో ఎటువంటి మార్పు లేదు. దేవస్థానం భూముల్లో అక్రమ నిర్మాణాలు ఆగటం లేదు. అధికారుల పర్యవేక్షణ అంతంతమాత్రంగానే ఉండటంతో అక్రమార్కులు రెచ్చిపోతున్నారు.

ఆలయ భూముల్లో... అక్రమాల పర్వం
ఆలయ భూముల్లో... అక్రమాల పర్వం

అక్టోబరులో ప్రత్యేక డిప్యూటీ కలెక్టరు సురేంద్రను నియమించిన ప్రభుత్వం భూముల పరిస్థితిపై 15 రోజుల్లో నివేదిక తెప్పించుకుంది. అయినా పరిస్థితి మారలేదు. అధికారుల పర్యవేక్షణ లోపంతో అక్రమ నిర్మాణాల జోరు మళ్లీ మొదలైంది. కీలక పోస్టులు ఇన్‌ఛార్జ్‌లతో నడవడం, ఆక్రమణలను గుర్తించే గార్డులు తగినంతగా లేకపోవడం, ఏఈవోల పర్యవేక్షణ అంతంతమాత్రంగానే ఉండడంతో ఎక్కడ ఏం జరుగుతుందో తెలియడంలేదు. కొందరికి తెలిసినా చూసీచూడనట్లు వదిలేస్తున్నారు.

అక్రమ నిర్మాణాలను ప్రోత్సహించడంలో కొందరు ఉద్యోగుల పాత్ర ఉన్నట్లు గుర్తించి వారిపై చర్యలకు ఆదేశించారు.

పంచగ్రామాల్లో.. ఇష్టానుసారంగా: పంచగ్రామల్లో దేవస్థానం మంజూరు చేసిన భూమి క్రమబద్ధీకరణ పత్రం (ఎల్‌ఆర్‌సీ) ఉన్న స్థల యజమానులు మాత్రమే జీవీఎంసీ అనుమతి తీసుకుని భవనాలు నిర్మించాలి. కానీ, కొందరు తమకు నచ్చినట్లు నిర్మాణాలు సాగిస్తున్నారు. దేవస్థానం, జీవీఎంసీకి చెందిన కొందరు సిబ్బంది నిర్మాణదారుల నుంచి కొంత డబ్బు తీసుకొని నిర్మాణాలు ప్రోత్సహిస్తున్నారనే ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి.

వసూళ్లు ఇలా...

దేవస్థానం సిబ్బంది కొందరు మధ్యవర్తులను నియమించుకొని వారి ద్వారా పంచగ్రామాల్లో అక్రమ నిర్మాణాలు చేపట్టిన వారి నుంచి వసూళ్లు చేపట్టి నిర్మాణాలు ప్రోత్సహిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. భవన నిర్మాణ పనులు కూడా వారు చెప్పిన గుత్తేదారులకే అప్పగించేలా ఒప్పందాలు సైతం జరుగుతున్నట్లు సమాచారం. గతంలో కన్నా ఇప్పుడు అధిక సంఖ్యలో అక్రమ నిర్మాణాలు జరుగుతున్నట్లు తెలుస్తోంది.

పంచగ్రామాల్లో కొందరు ఇళ్లు నిర్మించి వాటిని ప్రైవేటు వ్యక్తులకు సైతం అమ్మేస్తున్నారు. ప్రస్తుతం 98వ వార్డు గణేశ్‌కాలనీ, శ్రీనివాసనగర్‌, 93వవార్డు శంకర్‌ఫౌండేషన్‌ ఆసుపత్రి వెనుక సాయిదుర్గానగర్‌ , 94వవార్డు ఆర్‌ఆర్‌ వెంకటాపురం, నాయుడుతోట, రవినగర్‌, గౌతంనగర్‌, వేపగుంట, వరలక్ష్మీనగర్‌, పురుషోత్తపురాల్లో నిర్మాణాలు జోరుగా సాగుతున్నాయి. గోపాలపట్నం, ఆరిలోవ, హనుమంతవాక కొండవాలు ప్రాంతల్లోనూ ఇదే పరిస్థితి ఉంది. కైలాసపురం, ఆరిలోవ పంచగ్రామాల్లో కొన్నిచోట్ల పలువురు ఇళ్లు నిర్మించి వాటిని దర్జాగా విక్రయిస్తున్నారు.

ఇది గణేశ్‌కాలనీలోని ప్రాతం... అనుమతి ఉందని చేపట్టిన నిర్మాణంపై ఫిర్యాదు రావడంతో దేవస్థానం సిబ్బంది అడ్డుకున్నారు.

పట్టించుకోని యంత్రాంగం

అంతా తాత్కాలికమే: గతకొంత కాలంగా సింహాచలం దేవస్థానానికి పూర్తిస్థాయి ఈవో, ఎస్‌డీసీ అధికారులు లేరు. ఈవో వెంకటేశ్వరరావు తరువాత ఇద్దరు అధికారులకు ఇన్‌ఛార్జి బాధ్యతలు అప్పగించగా తాజాగా మాన్సాస్‌ ఈవోకు ఇన్‌ఛార్జి బాధ్యతలు అప్పగించారు. వేల ఎకరాల భూములున్న సింహాచలం దేవస్థానానికి ఎస్‌డీసీ ఉండాల్సినప్పటికీ పూర్తిస్థాయి అధికారిని నియమించలేదు. తాత్కాలికంగా ప్రత్యేక డిప్యుటీ కలెక్టర్‌ సూర్యకళను నియమించారు.

అప్పట్లో గుర్తించినవి సైతం...

లాక్‌డౌన్‌ సమయంలో ఇష్టానుసారంగా జరిగిన అక్రమ నిర్మాణాలపై ఫిర్యాదులు అందడంతో దేవాదాయశాఖ సంయుక్త కమిషనర్‌ ఆజాద్‌ క్షేత్రస్థాయిలో పరిశీలించి 30కిపైగా అక్రమ నిర్మాణాలు జరిగినట్లు గుర్తించారు. వాటిని యథాస్థితిలో నిలిపివేయించాలని అప్పట్లో దేవస్థాన సిబ్బందిని ఆదేశించారు. నాడు పునాదులు స్థాయిలో ఉన్న చోట నేడు గృహప్రవేశాలు సైతం జరగడం గమనార్హం.

● ఇటీవల వేపగుంట బీఆర్‌టీఎస్‌ రహదారిలో ఓ భారీ షెడ్డు నిర్మాణం చేపట్టినా అధికారులకు తొలుత సమాచారం తెలియలేదు. ఫిర్యాదు అందడంతో ఎట్టకేలకు పనులు నిలిపేశారు. గణేష్‌నగర్‌లోనూ ఓ నిర్మాణాన్ని గుర్తించారు. గోపాలపట్నం, కైలాసపురం, పంచగ్రామాల్లో నిర్మాణాలు గుర్తించాల్సినవి ఉన్నాయి.

భూముల పరిరక్షణ ఎలా?

సింహాచలం దేవస్థానానికి దాదాపు తొమ్మిది వేల ఎకరాలకుపైగా భూములున్నాయి. భూముల ఆక్రమణతో పాటు అదనపు నిర్మాణాలను గుర్తించేందుకు ఇక్కడ గార్డుల వ్యవస్థ ఉన్నా తగినంతమంది లేరు. గతంలో వీరి సంఖ్య పెంచాల్సి ఉందని స్పెషల్‌ డిప్యుటీ కలెక్టర్‌ సురేంద్ర సూచించినా ఇప్పటివరకు ఏర్పాటు చేయలేదు.వివిధ విభాగాలను పర్యవేక్షించే ఏఈవోలకు భూముల పర్యవేక్షణ చేపట్టాలని సూచించినా అదీ పూర్తిగా సాగటం లేదు. ఎప్పటికప్పుడు చిత్రాలు తీసేందుకు ఫోన్లు సిబ్బందికి ఇవ్వాలని సూచించినా ఇవేమీ అమలులోకి రాలేదు. పూర్తిస్థాయి ఎస్‌డీసీ లేకపోవడం అక్రమార్కులకు కలిసొస్తోంది.

ఇదీ చదవండి: స్థానిక ఎన్నికల్లో వైకాపాకు బుద్ధి చెప్పాలి: అయ్యన్న

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.