వాగులో జారిపడి చిన్నారి గల్లంతు విశాఖ మన్యంలోని పెదబయలు మండలం బొండపల్లిలో దారుణం చోటు చేసుకుంది. ఓ వ్యక్తి చిన్నారిని పట్టుకుని వాగు(గడ్డ) దాటుతుండగా... పట్టుజారి చిన్నారి వాగులో కొట్టుకుపోయింది. గడ్డ కొండవాలులో ఉండటం వలన నీటి ప్రవాహంలో చిక్కుకుని కొట్టుకుపోయిందని గ్రామస్థులు తెలిపారు. చిన్నారి కోసం గ్రామస్థులు గాలిస్తున్నారు. మన్యంలో గత కొద్ది రోజులుగా కురుస్తున్న వర్షాలతో వాగులు పొంగిపొర్లుతున్నాయి. మన్యంలో సరైన వంతెనలు లేక గడ్డలు దాటుతూ గిరిజనులు ప్రమాదాల బారిన పడుతున్నారు.
ఇదీ చదవండి : 50 లక్షలు దోచేశారు... అడ్డంగా బుక్కయ్యారు