ఏడాదికి రూ.10 వేల కోట్ల చొప్పున రాష్ట్రంలోని గ్రామ పంచాయతీలకు కేంద్ర నిధులు సమకూరుస్తోందని... భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు సోము వీర్రాజు వివరించారు. పలు పథకాలకు కేంద్రం నిధులు ఇస్తుంటే... రాష్ట్ర ప్రభుత్వం స్టిక్కర్లు వేసుకొని ప్రచారం చేసుకుంటోందని వ్యాఖ్యానించారు. గిరిజన వైద్య కళాశాలలకూ కేంద్ర ప్రభుత్వం రూ.50 కోట్ల చొప్పున నిధులు ఇస్తోందన్నారు. రాష్ట్రంలో పర్యాటక అభివృద్ధి కోసం రూ.700 కోట్లు ఇస్తే... కనీస వసతులు కల్పించడంలేదని విమర్శించారు. కేంద్ర పథకాలను కార్యకర్తలు ప్రజల్లోకి తీసుకెళ్లాలని దిశానిర్దేశం చేశారు. ఇటీవల పంచాయతీ ఎన్నికల్లో గెలిచిన సర్పంచి, ఉప సర్పంచి, వార్డు సభ్యులను ఆయన సన్మానించారు.
ఇదీ చదవండీ... కార్పొరేట్ తరహాలో ప్రభుత్వ ఆస్పత్రి సేవలు ఉండాలి: జగన్