ETV Bharat / state

అనకాపల్లిలో 800కు చేరిన కరోనా కేసుల సంఖ్య - visakha district latest corona cases

అనకాపల్లిలో కరోనా కేసులు రోజురోజుకు పెరుగుతున్నాయి. తాజాగా 55 కేసులు నమోదయ్యాయి. వీటితో కలిపి పట్టణంలో కేసుల సంఖ్య 800కు చేరుకుంది.

cases increased to 800 in anakapalle and officers gets alerted
అనకాపల్లిలో పెరుగుతున్న కరోనా కేసులు
author img

By

Published : Aug 11, 2020, 3:44 PM IST

విశాఖ జిల్లా అనకాపల్లిలో తాజాగా 55 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో బాధితుల సంఖ్య 800కు చేరుకుంది. పట్టణంలోని గవరపాలెం, వేల్పుల వీధి, శ్రీ రామ్​నగర్​ కాలనీ, న్యూ కాలనీ, పూడిమాడక రోడ్డు, గాంధీనగరం, పప్పుల వీధి, సబ్బవరం రోడ్డు, నర్సింగరావు పేట ప్రాంతాల్లో వ్యాధి తీవ్రత ఉద్ధృతంగా ఉంది. పట్టణ పోలీస్​ స్టేషన్​కు చెందిన ముగ్గురు సిబ్బంది కూడా వ్యాధి బారిన పడ్డారు. దీంతో అధికారులు మంగళవారం నుంచి పట్టణంలో పాక్షిక లాక్​డౌన్​ కొనసాగిస్తున్నారు. ఉదయం 6 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు మాత్రమే దుకాణాలకు అనుమతిచ్చారు. కరోనా బారిన పడకుండా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వైద్య, ఆరోగ్య శాఖ అధికారులు తెలియజేశారు.

ఇదీ చదవండి :

కరోనా రౌండప్​: జిల్లాలో కొత్తగా 621 పాజిటివ్ కేసులు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.