లోయలో పడ్డకారు.. స్వల్ప గాయాలతో బయటపడిన ప్రయాణికులు విశాఖ మన్యం పెదబయలు మండలం గంపరాయ ఘాట్ రోడ్డు వద్ద ఓ స్విఫ్ట్ కారు ప్రమాదవశాత్తు అదుపు తప్పి 30 అడుగుల లోయలో పడిపోయింది. వెంటనే స్పందించిన స్థానికులు ప్రయాణికులను క్షేమంగా బయటకు తీశారు. ఎలాంటి ప్రాణనష్టం జరగకపోవటంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఘాట్ రోడ్డులో రక్షణ లేకపోవటమే ఇక్కడ ప్రమాదాలకు కారణమని స్థానికులు వాపోయారు. అధికారులు ఇప్పటికైనా స్పందించి భద్రతా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.ఇదీ చదవండి:
విశాఖలో దొంగల ముఠా అరెస్టు