విశాఖ జిల్లాలోని సింహాచలం అప్పన్న సన్నిధిలో నూతనంగా పదవి బాధ్యతలు చేపట్టిన ఆలయ ఈవో భ్రమరాంబను ట్రస్ట్ సభ్యులు మర్యాదపూర్వకంగా కలిశారు. నగరంలో ఉన్న ప్రహ్లాద ఆలయాన్ని దేవదాయశాఖ పరిధిలోకి తీసుకోవాలని, ఈ మేరకు కలెక్టర్కు లేఖ రాయాలని ఈవోకి విజ్ఞప్తి చేశారు. ప్రహ్లాద మందిరం దేవాదాయశాఖ ఆధీనంలో లేకపోవడం వల్ల సుమారు రూ.2కోట్ల వరకు ఆదాయం కోల్పోవాల్సి వచ్చిందని వారు తెలిపారు. అలాగే... అభివృద్ధి పనుల్లో పలు ఆరోపణలు వస్తున్నాయని, వాటిని కూడా పరిశీలించాల్సిందిగా ట్రస్ట్ సభ్యులు కోరారు. ఈవోను కలిసిన వారిలో వారణాసి దినేష్ రాజు, సూరి శెట్టి, సూరి బాబు, జి మాధవి కుమారి తదితరులు ఉన్నారు.
ప్రహ్లాద మందిరాన్ని దేవాదాయశాఖలోకి తీసుకోండి... - ఈటీవీ భారత్ తాజా వార్తలు
విశాఖ నగరంలో ఉన్న ప్రహ్లాద మందిరాన్ని దేవదాయశాఖలోనికి తీసుకోవాలని ట్రస్ట్ సభ్యులు సింహాచలం ఆలయ ఈవో భ్రమరాంబను కోరారు. విశాఖ జిల్లాలోని సింహాచలం ఆలయ ఈవో భ్రమరాంబను ట్రస్ట్ సభ్యులు మర్యాదపూర్వకంగా కలిశారు.