విజయనగరం జిల్లా రామతీర్థం విగ్రహం ధ్వంసం ఘటనను నిరసిస్తూ... విశాఖపట్నం జిల్లా మాకవరపాలెం తహసీల్దార్ కార్యాలయం వద్ద భాజపా ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు. ఈ మేరకు కార్యాలయం ఎదుట మోకాళ్లపై కూర్చుని నినాదాలు చేశారు. విగ్రహం ధ్వంసం చేసిన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. అనంతరం తహసీల్దార్‌కు వినతి పత్రం అందజేశారు.
రామతీర్థంలో రాముని విగ్రహం విధ్వంసానికి కారకులైన దోషులను శిక్షించాలంటూ... విశాఖపట్నంలో భాజపా ఆందోళన చేసింది. జీవీఎంసీ గాంధీ బొమ్మ వద్ద పార్టీ ఆధ్వర్యంలో భారీ ధర్నా నిర్వహించారు. వైకాపా ప్రభుత్వ హయాంలో దేవాలయాలపై దాడులు పెరిగాయని ఆవేదన వ్యక్తం చేశారు.
ముఖ్యమంత్రి జగన్‌ది ముమ్మాటికీ హిందూ వ్యతిరేక ప్రభుత్వమే అని భాజపా రాష్ట్ర మీడియా ప్రతినిధి పెద్దిరెడ్డి కిరణ్ ఆరోపించారు. 2020 జనవరిలో పిఠాపురం పుణ్యక్షేత్రంలో దేవతా విగ్రహాలపై దాడి ఘటన నుంచి నేటి విజయనగరం జిల్లా రామతీర్థం ఘటన వరకు అనేక ఆలయాలపై దాడులు పెరిగాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఘటనలతో హిందువులు మనోవేదనకు గురవుతున్నారని అన్నారు.
ఇదీచదవండి.
అమ్మమ్మ కష్టం : క్యాన్సర్‌తో పోరాటం... మనవడిని బతికించుకోవాలని ఆరాటం