రైతులకు గిట్టుబాటు ధర కల్పించకపోవడం అన్యాయమని భాజపా రాష్ట్ర ఉపాధ్యక్షులు, మాజీ ఎమ్మెల్యే విష్ణుకుమార్‌రాజు అన్నారు. విశాఖపట్నం లాసన్స్‌బేకాలనీ భాజపా కార్యాలయంలో మంగళవారం ఉదయం రైతులకు మద్దతుగా దీక్ష నిర్వహించారు.
ప్లకార్డులు పట్టుకొని కార్యాలయంలో బైఠాయించారు. రైతులకు ఏపీలో మోసం జరుగుతుందని విష్ణుకుమార్‌రాజు అన్నారు. బీజేవైఎం రాష్ట్ర అధ్యక్షుడు సురేంద్రమోహన్, భాజపా నాయకులు కాశీవిశ్వనాథరాజు, కిసాన్ మోర్చా నాయకులు పాల్గొన్నారు.
ఇదీ చదవండి: