ఉద్యానవన పంటలను ఆశించే తెగుళ్లపై విశాఖ జిల్లా అన్నవరంలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఉద్యానవనశాఖ అధికారిణి జీ. రాధిక ఆధ్వర్యంలో కొబ్బరి, జామ, అరటి, బొప్పాయి తదితర పంటలను ఆశించి నష్టపరుస్తున్న తెల్లదోమలను నివారించే పద్ధతులపై రైతులకు అవగాహన కల్పించారు. తెల్లదోమ ఆకుల అడుగు భాగంలో రసం పీలుస్తుందన్నారు. అవి విసర్జించే జిగురులాంటి రసం వల్ల మసితెగుళ్లు ఆశించి ఆకులు నల్లగా మాడిపోయినట్లు అవుతాయని తెలిపారు.
వీటి నివారణకు రసాయన మందులు పిచికారీ చేయకూడదన్నారు. గంజి ద్రావణం, సబ్బుపొడి, సర్ఫ్ నీటిని పిచికారీ చేసి మసితెగుళ్లను నివారించవచ్చని తెలిపారు. 1500 పీపీఎమ్ వేపనూనె 5 మిల్లీలీటర్ల నీటిలో కలిపి 15 రోజులకోసారి పిచికారీ చేస్తే మంచి ఫలితాలు ఉంటాయని తెలిపారు.
ఇవీ చదవండి...: విశాఖ జిల్లాలో కరోనా విజృంభణ... విస్తృతంగా జాగ్రత్త చర్యలు