విశాఖ మన్యంలో పర్యాటక ప్రదేశాలను అభివృద్ధి చేయాలని ముఖ్యమంత్రి జగన్కు విజ్ఞప్తి చేశారు అరకు ఎంపీ గొడ్డేటి మాధవి. ఏజెన్సీలోని గుమ్మ జలపాతం (కొయ్యూరు మండలం), సరయ జలపాతం (అనంతగిరి మండలం) ను ఆధునీకరించాలని ఆమె కోరారు. డుంబ్రిగూడ మండలం చాపరాయి జలపాతాన్ని పర్యాటక కేంద్రంగా రూపుదిద్దాలని.. అక్కడ కేబుల్ బ్రిడ్జి నిర్మించాలని విజ్ఞప్తి చేశారు.
గిరిజన యువతకు ఉపాధి కల్పించడంతో పాటు.. టూరిజాన్ని ఏజెన్సీ ప్రాంతంలో విస్తరించేందుకు ఉన్న అవకాశాలను సీఎం దృష్టికి ఎంపీ తీసుకువెళ్లారు. జలపాతాల పనులకు సీఎం సానుకూలంగా స్పందించారని.. అధికారులకు అభివృద్ధి చేసేలా ఆదేశాలను జారీ చేశారని ఆమె తెలిపారు.
ఇదీ చూడండి: