ఇదీ చూడండి:
ఆరోగ్య రథం వైద్య సేవలను నిలిపివేయొద్దు..! - ap jenco health bus at seleru in visakhapatnam news
ఏపీ జెన్‌కో గిరి గ్రామాలకు వైద్యసేవలు అందించేందుకు ఏర్పాటు చేసిన ఆరోగ్యరథం సేవలను నిలిపివేయడానికి యోచిస్తున్నట్లు ... వచ్చిన సమాచారంతో గిరి గ్రామాల్లో ఆందోళన నెలకొంది.
ఆరోగ్యరథం వద్ద పరీక్షలు చేయిమచుకుంటున్న చిన్నారులు
సుమారు 15 నెలలు క్రితం ప్రయోగాత్మకంగా ఏపీ జెన్‌కో రాష్ట్రంలో రెండు ఆరోగ్యరథాలను ఏర్పాటు చేయగా.... ఒకటి సీలేరు కాంప్లెక్స్‌కు కేటాయించారు. అత్యాధునిక సాంకేతికతో కూడిన వైద్య సేవలను ఈ రథంలో అందుబాటులో ఉంచారు. మలేరియా, టైఫాయిడ్, డెంగీ జ్వరాలతోపాటు సుమారు 200 పరీక్షలు ఉచితంగా చేసి.. మందులు కూడా అందిస్తారు. సుమారు 40 గిరి గ్రామాలకు నెలకొకసారి ఈ సేవలు అందించే విధంగా అధికారులు ప్రణాళిక రూపొందించారు. ఈ సేవలను నిలిపి వేయడానికి ఏపీ జెన్‌కో సన్నాహాలు చేస్తున్నట్టు సమాచారం రావడం వల్ల ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఏపీ జెన్‌కో అధికారులు సామాజిక బాధ్యతతో ఏర్పాటు చేసిన ఆరోగ్యరథం సేవలను కొనసాగించాలని కోరుతున్నారు.
ఇదీ చూడండి:
Intro:AP_VSP_56_14_AROGYA RADHAM PAI ANDOLANA_AVB_AP10153Body:ఏపీ జెన్‌కో కార్పోరేట్ సామాజిక బాధ్యతలో భాగంగా గిరి గ్రామాలకు అత్యాధునిక వైద్యసేవలు అందించేందుకు ఏర్పాటుచేసిన ఆరోగ్య రథం సేవలను నిలిపివేయడానికి సన్నహాలు చేస్తున్నట్టు వచ్చిన సమాచారంతో గిరి గ్రామాల్లో ఆందోళన ప్రారంభమైంది. సుమారు 15 నెలలు క్రితం ప్రయోగాత్మకంగా ఏపీ జెన్‌కో రాష్ట్రంలో రెండు ఆరోగ్యరథంలను ఏర్పాటుచేయగా, అందులో ఒకటి సీలేరు కాంప్లెక్స్‌కు కేటాయించారు. కార్పోరేట్ ఆసుపత్రిలో ఉన్న అత్యాధునికి సాంకేతికతో కూడిన పరీక్షలను ఈ రథంలో ఏర్పాటుచేశారు. ఈ ప్రాంతంలో ఉండే మలేరియా, టైఫాయిడ్, డెంగీ జ్వరాలతో బాటు సుమారు 200 పరీక్షలు ఉచితంగా చేయడమే కాకుండా ఉచితంగా మందులు పంపిణీచేసేవిధంగా ఏపీ జెన్‌కో రథాన్ని అందుబాటులోకి తీసుకువచ్చింది. సుమారు 40 గిరి గ్రామాలకు అత్యాధునిక సేవలు అందించేవిధంగా నెలకు ప్రతీ గ్రామాన్ని సందర్శించేవిధంగా ప్రణాళిక రూపొందించి సేవలను విస్త్రుతం చేశారు. సుమారు 15 నెలలు పాటు అందరికి అందుబాటులోకి వచ్చిన ఈ ఆరోగ్యరథం సేవలను నిలిపివేయడానికి ఏపీ జెన్‌కో యాజమాన్యం సన్నహాలు చేస్తున్నట్టు సమాచారం రావడంతో ఈ ప్రాంతీయులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ ప్రాంతంలో ఉన్న వనరులతో విద్యుదుత్పత్తి చేస్తున్నప్పటికీ మాకు విద్యుత్తు సరఫరా చేయడంలేదు సరికదా, అత్యాదునిక వైద్యసేవలను అందుబాటులోకి తీసుకువచ్చి మరలా వాటిని దూరం చేయడం ఎంతవరకు సబబని ఈ ప్రాంతీయులు ప్రశ్నిస్తున్నారు. ఏపీ జెన్‌కో అధికారులు సామాజిక బాధ్యతతో ఏర్పాటుచేసిన ఆరోగ్యరథం సేవలను కొనసాగించాలని ఈ ప్రాంతీయులు కోరుతున్నారు.
బైట్స్
వంతల ప్రబాస్
నాళ్ల వెంకటే్శ్వరరావుConclusion:M Ramanarao, Sileru,9440715741
బైట్స్
వంతల ప్రబాస్
నాళ్ల వెంకటే్శ్వరరావుConclusion:M Ramanarao, Sileru,9440715741