ETV Bharat / state

Golden Taj mahal: తలవెంట్రుక మొనపై బంగారు తాజ్‌మహల్‌.. ఏటికొప్పాక వాసి అద్భుత ప్రతిభ! - సూక్ష్మకళలో చెన్నయ్యచారి ప్రతిభ

తలవెంట్రుక మెునపై బంగారంతో తాజ్​మహల్​ రూపొందించి అబ్బురపరిచారు.. ఏటికొప్పాకకు చెందిన ప్రముఖ హస్తకళాకారుడు శ్రీశైలపు చెన్నయ్యచారి. భారతీయ సంస్కృతి సంప్రదాయాలను ప్రపంచ వ్యాప్తంగా చాటి చెప్పాలన్న ఆశయంతో.. ఈ అద్భుత కళాకృతిని సృష్టించినట్లు ఆయన తెలిపారు.

Srisailam Chennaiyyachari
తలవెంట్రుక మొనపై బంగారు తాజ్‌మహల్‌
author img

By

Published : Jun 2, 2021, 11:25 AM IST

ప్రముఖ హస్తకళాకారుడు శ్రీశైలపు చెన్నయ్యచారి

విశాఖ జిల్లా ఏటికొప్పాకకు చెందిన... జాతీయ అవార్డు గ్రహీత, ప్రముఖ హస్త కళాకారుడు శ్రీశైలపు చెన్నయ్యచారి...అరుదైన కళాఖండాన్ని ఆవిష్కరించారు. తల వెంట్రుక మొనపై.. బంగారంతో తాజ్‌మహల్‌ ను తయారుచేసి రికార్డు సాధించారు. సూక్ష్మ కళాఖండాల రూపకల్పనలో దిట్ట అయిన చెన్నయ్యచారి... ఈ అతి సూక్ష్మ కళాఖండాన్ని రూపొందించారు.

ఈ తాజ్ మహల్ పొడవు 0.1 మిల్లీమీటర్లు కాగా.. వెడల్పు 0.15 మిల్లీ మీటర్లు. సూక్ష్మదర్శినితో తప్ప మామూలుగా చూడలేని అతి చిన్న తాజ్‌మహల్‌ను.. ఐదురోజుల పాటు శ్రమించి తీర్చిదిద్దారు. ప్రపంచంలోనే అతి చిన్న తాజ్‌మహల్‌గా ఇది గుర్తింపు సాధిస్తుందని ఆయన విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు.

ఇదీ చదవండి:

బ్రహ్మంగారిమఠంలో ఆధిపత్య పోరు.. పీఠంపై కొనసాగుతున్న ప్రతిష్టంభన!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.