ETV Bharat / state

అలవాట్లు మారితే.. పల్లెలు పరిశుభ్రంగా ఉంటాయి: మంత్రి అప్పలరాజు - శ్రీకాకుళం జిల్లాలో వ్యర్థాలపై పోరాటం కార్యక్రమం వార్తలు

ప్రతి ఒక్కరి ఆలోచనలు, అలవాట్లు మారితే పల్లెలు పరిశుభ్రంగా ఉంటాయని మంత్రి సీదిరి అప్పలరాజు అన్నారు. మనం-మన పరిశుభ్రత కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరూ విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ మేరకు పోస్టర్​ను విడుదల చేశారు.

Minister_Review
Minister_Review
author img

By

Published : Dec 7, 2020, 5:33 PM IST

ప్రతి ఒక్కరిలో ఆలోచనలు, అలవాట్లు మారితే పల్లెలు పరిశుభ్రంగా ఉంటాయని మంత్రి సీదిరి అప్పలరాజు అన్నారు. శ్రీకాకుళం జిల్లా పరిషత్ కార్యాలయంలో మనం-మన పరిశుభ్రతలో భాగంగా వ్యర్థాలపై వ్యతిరేక పోరాటంపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. జిల్లా కలెక్టర్ నివాస్, జేసీ శ్రీనివాసులతో కలిసి మంత్రి పాల్గొన్నారు.

ఈరోజు నుంచి ఈనెల 21వ తేదీ వరకు జిల్లా, మండల, గ్రామస్థాయిలో మనం-మన పరిశుభ్రత పక్షోత్సవాలు నిర్వహిస్తున్నట్లు మంత్రి తెలిపారు. ప్రజల్లో చైతన్యం తీసుకురావాలన్న మంత్రి.. అధికారులు చిత్తశుద్ధితో పని చేయాలని పిలుపునిచ్చారు. మహిళలు, ప్రజలతో సమావేశాలు నిర్వహించి.. పారిశుద్ధ్య నిర్మూలనపై అవగాహన కల్పించాలన్నారు.

ఇదీ చదవండి

'సీఎం ఏలూరు పర్యటనలో పెళ్లి వేడుకకే ప్రాధాన్యం ఇచ్చారు'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.